బెల్లం గోడౌన్లపై ఎకై ్సజ్‌అధికారుల దాడులు
చింతలపూడి: పట్టణంలోని బెల్లం దుకాణాలు, గోడౌన్లను ఎకై ్సజ్ అధికారులు మంగళవారం తనిఖీలు చేశారు. స్టాకు రిజిస్టర్లను, బెల్లం నిల్వలను పరిశీలించారు. మెట్టలో విచ్చలవిడిగా నాటుసారా అనే శీర్షికతో సాక్షిలో ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించారు. పట్టణంలో బెల్లం విక్రయాలు జరుపుతున్న వ్యాపారులకు నోటీసులు జారీ చేశారు. బెల్లం ఎవరికి విక్రయిస్తున్నారో? వివరాలు ప్రతీ 15 రోజులకు ఒకసారి ఎకై ్సజ్ సర్కిల్ కార్యాలయంలో అందచేయాలని సీఐ పి.అశోక్ ఆదేశించారు. ప్రతి విక్రయానికీ రసీదు ఇవ్వాలని చెప్పారు. నాటు సారా తయారీదారులకు బెల్లం విక్రయిస్తే కేసులు నమోదు చేస్తామని చెప్పారు. పట్టణంలోని ఆరుగురు వ్యాపారులను తహసీల్దార్ డి.ప్రమద్వర ముందు బైండోవర్ చేశామని వివరించారు.
కృష్ణకిషోర్‌కు కృష్ణంరాజు ప్రతిభా పురస్కారం
భీమవరం: పట్టణానికి చెందిన శ్రీకాకతీయ స్కూల్ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ అక్కినేని కృష్ణకిషోర్‌కు రెబల్ స్టార్ కృష్ణంరాజు ప్రతిభా పురస్కార్ అవార్డు–2025 లభించింది. కృష్ణ కిషోర్ విద్యా రంగానికి చేసిన విశేష కృషికి హైదరాబాద్ లోని బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో ఎఫ్టీపీసీ అధ్యక్ష, కార్యదర్శులు చైతన్య, వర్మ నేతృత్వంలో కృష్ణంరాజు జయంతి సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్, సినీ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ చేతుల మీదుగా అవార్డునందుకున్నారు. అవార్డును అందుకుని భీమవరం వచ్చిన కృష్ణకిషోర్‌ను స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు అభినందించారు.
హత్యాయత్నం కేసులోనిందితుడి అరెస్ట్
గణపవరం: ఒక వ్యక్తి గొంతుకోసి హత్యాయత్నం చేసిన ముద్దాయిని మంగళవారం అరెస్టు చేసినట్లు గణపవరం ఎస్సై మణికుమార్ తెలిపారు. తణుకు మండలం దువ్వ గ్రామానికి చెందిన బొడ్డు కృష్ణ అనే వ్యక్తిని సోమవారం సాయంత్రం అదే గ్రామానికి చెందిన గండికోట జానేషు అనే వ్యక్తి గణపవరం మండలం ముగ్గుళ్ల గ్రామం వద్దకు తీసుకువచ్చి చాకుతో గొంతుకోసి పరారయ్యాడు. చావుబతుకుల్లో ఉన్న కృష్ణను స్థానికులు తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు జానేషును మంగళవారం సాయంత్రం వరదరాజపురం గ్రామ సెంటర్‌లో అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు.
Comments
Please login to add a commentAdd a comment