కార్గో డెలివరీల్లో తణుకు డిపోకు ప్రథమం
తణుకు అర్బన్: ఏపీఎస్ ఆర్టీసీ నిర్వహించిన కార్గో పార్సిల్, కొరియర్ డోర్ డెలివరీ మాసోత్సవాల్లో 321 శాతం గ్రోత్‌తో తణుకు డిపో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచినట్లు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కార్గో కమర్షియల్ మేనేజరు ఎ.లక్ష్మి ప్రసన్న వెంకట సుబ్బారావు అన్నారు. తణుకు డిపోలో మంగళవారం డిపో మేనేజరు సప్పా గిరిధర్‌కుమార్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విజయవాడ జోన్ తాడేపల్లిగూడెం డిపో 302 శాతం గ్రోత్‌తో రెండో స్థానం సాధించడం ఫలితంగా పశ్చిమ గోదావరి జిల్లా రాష్ట్రంలో ద్వితీయ స్థానం పొందడం అభినందనీయమని స్పష్టం చేశారు. ఈ సందర్బంగా తణుకు డిపో మొదటి స్థానంలో నిలవడంలో విశేష కృషిచేసిన డిపో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌లు షేక్ లాల్, ఎ.మాధవరావులతోపాటు అత్యధిక డోర్ డెలివరీలు బుక్ చేసిన వినియోగదారుడు శ్రీ లావణ్య ఫీడ్స్ ప్రాప్రైటర్ కోసూరి సతీష్ వర్మ, తణుకు కార్గో టీం లీడర్ కనుమూరి సందీప్, ఆపరేటర్‌లను, హమాలీలను సత్కరించారు. అనంతరం డోర్ డెలివరీ మాసోత్సవ 4వ వారం, బంపర్ డ్రా విజేతలను ప్రకటించారు. 3వ వారం విజేతలకు బహుమతులను అందించారు. ఈ కార్యక్రమంలో సింగ్ సొల్యూషన్ ప్రాజెక్టు మేనేజర్ అరసాడ శ్రీధర్, ఆఫీస్ సూపరింటెండెంట్ వెన్నా రమణమూర్తి, ఆయిల్ డిపో క్లర్కు మహమ్మద్ అలీ, సీనియర్ అసిస్టెంట్ కొత్తలంక శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment