టీం సమన్వయంతో విజయం
ఈ విజయం నాలో ఎంతో ధైర్యాన్ని నింపింది. రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు సాధిస్తాం. పెద్ద టోర్నమెంట్‌లో విజయం సాధించాలంటే టీం కో ఆర్డినేషన్ చాలా ముఖ్యం. మేం అందరం ఒక జట్టులా ఆడాం. మమ్మల్ని ఓడించేందుకు ప్రత్యర్థి జట్లు చాలా ప్రయత్నించాయి. అయినప్పటికీ వాళ్లు విజయం సాదించలేకపోయారు.
బి.లీలావతి, ఏలూరు
నిరంతర సాధన ముఖ్యం
టోర్నమెంట్‌లో మేం మొత్తం 7 మ్యాచ్‌లు ఆడాం. ఏడింటిలో విజయం సాధించాం. వరుసగా గెలవాలంటే నిరంతర ప్రాక్టీసు ఎంతో ముఖ్యం. ప్రాక్టీసు లేకుండా విజయాలు సాధించలేం. మేం టోర్నికి ముందురోజు సైతం ఎంతో సాధన చేశా. ఏ మ్యాచ్‌లో ఎలా ఆడాలో మా కోచ్ మురళీకృష్ణ ఎంతో విలువైన సూచనలు, సలహాలు ఇచ్చారు.
టి.జ్యోతి, ఏలూరు
అద్భుత ప్రతిభ చాటారు
బాస్కెట్‌బాల్ పోటీల్లో జిల్లా బాలికలు అద్భుత విజయాలు సాధిస్తున్నారు. గతంలో ఎన్నడూ సాధించని విజయాల పట్ల ఎంతో సంతోషంగా ఉంది. నిరంతరం సాధన, పలు పోటీల్లో సాధించిన అనుభవం కారణంగా బాలికలు విజేతలుగా నిలిచారు. వీరి విజయాలతో మరింతమంది బాలికలు బాస్కెట్‌బాల్‌పై మక్కువ పెంచుకుంటున్నారు.
కె.మురళీకృష్ణ, వ్యాయామ ఉపాధ్యాయుడు, ఏలూరు
Comments
Please login to add a commentAdd a comment