రైలు నుంచి జారిపడి యువకుడి మృతి
భీమడోలు: భీమడోలు ఫ్‌లై ఓవర్ వంతెన సమీపంలో రైలు పట్టాలపై ఓ యువకుడి మృతదేహాన్ని ఆదివారం రైల్వే పోలీసులు గుర్తించారు. గుర్తుతెలియని రైలు బండి నుంచి జారిపడి తలకు బలమైన గాయాలై మృతి చెందినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడి వయస్సు 25 నుంచి 30 ఏళ్ల లోపు ఉంటుందని.. ఎత్తు సుమారు 5.6 అడుగులు, నల్లని జుట్టు, తెలుపు రంగు పొట్టి చేతుల టీషర్ట్, నలుపు, నీలం రంగు షార్ట్‌తో ఉన్నాడు. మృతదేహాన్ని ఏలూరులోని జీజీహెచ్‌లో పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించినట్లు ఎస్సై పి.సైమన్ పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మృతుడి వివరాలు తెలిస్తే 9989219559 నెంబర్‌కు ఫోన్ చేయాలని చెప్పారు.
ఎస్‌ఆర్‌కేఆర్‌కు సిస్కో నెట్‌వర్కింగ్ అవార్డు
భీమవరం: భీమవరం ఎస్‌ఆర్‌కెఆర్ ఇంజినీరింగ్ కళాశాలకు జాతీయస్థాయి సిస్కో నెట్‌వర్కింగ్ అవార్డు లభించిందని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కేవీ మురళీ కృష్ణంరాజు చెప్పారు. ఈ సందర్భంగా సిస్కో నుంచి వచ్చిన అవార్డును కళాశాల సెక్రటరీ సాగి రామకృష్ణ నిషాంత వర్మకు అందించారు. సిస్కో ఏటా దేశంలో అత్యుత్తమ కళాశాలలను గుర్తించి అవార్డులు ప్రదానం చేస్తుందని కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం.జగపతి రాజు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment