● రోల్స్ రాయిసా.. రీ మోడలా!
బ్రిటీష్ కాలం నాటి రోల్స్ రాయిస్ మోడల్ కారు ద్వారకాతిరుమలలో చూపరులను ఆకట్టుకుంది. స్థానిక ఎస్వీఎస్ ఫంక్షన్ హాల్లో ఆదివారం రాత్రి జరిగిన వివాహ వేడుకకు వధువరులను ఈ కారులో ఊరేగింపుగా తీసుకొచ్చారు. రూ.కోట్లాది రూపాయలు విలువైన బ్రిటీష్ కాలంనాటి ఈ రోల్స్ రాయిస్ మోడల్ కారు భలే.. ఉందంటూ పలువురు ఆశ్చర్యంగా తిలకించారు. రోల్స్ రాయిస్ మోడల్, లోగో ఉన్న ఈ కారు, రోల్స్ రాయిస్ ఇమిటేషన్ అయి ఉంటుందని, ఈవెంట్ వారు ఏర్పాటు చేసుంటారని పలువురు ట్రోల్స్ చేశారు. –ద్వారకాతిరుమల
Comments
Please login to add a commentAdd a comment