
ఫ్లఫీ పాన్‌కేక్ తయారీకి కావల్సినవి:
గుడ్లు – రెండు; లు – రెండు టేబుల్ స్పూన్లు; వెనీలా ఎసెన్స్ – పావు టీస్పూను; గోధుమ పిండి – పావు కప్పు; వంటసోడా – టీస్పూను; చక్కెర – రెండు టేబుల్ స్పూన్లు; ఉప్పు – చిటికెడు.
తయారీ విధానమిలా:
- గుడ్లలోని పచ్చసొనను ఒక గిన్నెలోకి తీసుకుని పాలు, వెనీలా ఎసెన్స్ వేసి ఐదు నిమిషాల పాటు నురగవచ్చేంత వరకు చక్కగా కలపాలి.
- ఇప్పుడు దీనిలో గోధుమ పిండి వేసి పేస్టులా కలిపి పక్కన పెట్టాలి.
- గుడ్ల తెల్ల సొనలో చిటికెడు ఉప్పు వేసి బాగా కలపాలి. ఒక్కో స్పూను చక్కెర వేస్తూ నురగ వచ్చేంత వరకు కలపాలి.
- నురగ వచ్చిన మిశ్రమాన్ని గుడ్ల పచ్చసొన మిశ్రమంలో వేసి కలపాలి.
- వేడెక్కిన నాన్‌స్టిక్ పాన్ పై కొద్దిగా నెయ్యిరాసి కేక్‌లా పోసుకోవాలి.
- ఈ కేక్ చుట్టూ రెండు మూడు స్పూన్ల నీళ్లుపోసి మూత పెట్టి గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి మారేంత వరకు రెండువైపులా చక్కగా ఉడికిస్తే జపనీస్ ఫ్లఫీ పాన్‌కేక్ రెడీ వేడిగా ఉన్నప్పుడే బటర్, మేపిల్ సిరప్‌తో సర్వ్‌చేసుకోవాలి.