టీడీపీ నేత పెమ్మసానికి నోటి దురుసు ఎక్కువ | Sakshi
Sakshi News home page

టీడీపీ నేత పెమ్మసానికి నోటి దురుసు ఎక్కువ

Published Tue, May 7 2024 11:20 AM

టీడీపీ నేత పెమ్మసానికి నోటి దురుసు ఎక్కువ

నగరంపాలెం: దళితుల జోలికి వస్తే టీడీపీ నేత పెమ్మసాని చంద్రశేఖర్‌కి తగిన బుద్ధి చెబుతారని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, ఏపీ గ్రంథాలయ పరిషత్‌ చైర్మన్‌ మందపాటి శేషగిరిరావు అన్నారు. గుంటూరు బృందావన్‌ గార్డెన్స్‌లోని పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం సాయంత్రం ఆయన విలేకరు సమావేశంలో మాట్లాడారు. తాడికొండ మండలం మోతాడకలో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసేందుకు పెమ్మసాని నిరాకరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విదేశాల నుంచి ఊడిపడిన పెమ్మసాని అక్కడ గన్‌ కల్చర్‌తో ఏపీలో దళితులపై ప్రయోగించేందుకు మోతాడక గ్రామంలో అవమానించారని ఆరోపించారు. పెమ్మసానికి దిమ్మ తిరిగే కౌంటర్‌ ఇవ్వనున్నారని చెప్పారు. మోతాడకలో దళితులను కించపరిచేలా దండ వేయకుండా, ఎవడ్రా ఆపమనేది వ్యాఖ్యానించడం సరికాదన్నారు. టీడీపీలోని దళితులు వ్యతిరేకిస్తే, తప్పని పరిస్థితుల్లో పెమ్మసాని అంబేడ్కర్‌కు దండ వేశారని చెప్పారు. తాడికొండ టీడీపీ అభ్యర్థి తెనాలి శ్రావణ్‌కుమార్‌ పక్కనే ఉన్నాడని, దీన్ని ఎందుకు వ్యతిరేకించలేదని ప్రశ్నించారు. బీఆర్‌ అంబేడ్కర్‌ కల్పించిన రిజర్వేషన్‌ అవసరం లేదా అని శ్రావణ్‌ను నిలదీశారు. పెమ్మసానితోపాటు దళితులంటే చులకన భావన టీడీపీ డీఎన్‌ఏలో ఉందని ఆరోపించారు. గతంలో ఎస్సీలుగా ఎందుకు పుట్టాలని చంద్రబాబు, ఎస్సీలు శుభ్రంగా ఉండరని మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, చింతమనేని ప్రభాకర్‌ మీకెందుకురా రాజకీయాలంటూ ఎద్దేవా చేశారని గుర్తుచేశారు. పెమ్మసానికి నోటి దూల చాలా సందర్భలాల్లో విన్నామని చెప్పారు. కొల్లిపరలోనూ, సద్దాంహుస్సేన్‌పై చేసిన వ్యాఖ్యలను ఆయన గుర్తుచేశారు. సీఎం వైఎస్‌ జగన్‌ హయాంలో సాధికారితతో దళితులు ఉన్నతంగా బతుకుతున్నారని అన్నారు. దళితులు గర్వంగా జీవించేలా చేశారని పేర్కొన్నారు. విజయవాడలో 205 అడుగుల డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. పేద, బడుగు వర్గాల ప్రజల కోసం వంద శాతం హామీలను అమలు చేస్తున్న దమ్ము, ధైర్యం ఉన్న ఏకై క వ్యక్తి వైఎస్‌ జగన్‌ అని అన్నారు. అంబేడ్కర్‌ ఆలోచనా విధానాలను వైఎస్‌ జగన్‌ అమలు చేస్తునాన్నరని పేర్కొన్నారు.

దళితుల జోలికి వస్తే తగిన బుద్ధి చెబుతాం వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు శేషగిరిరావు

Advertisement
 
Advertisement