పోలీస్‌ వాహనానికి తప్పిన ప్రమాదం | Sakshi
Sakshi News home page

పోలీస్‌ వాహనానికి తప్పిన ప్రమాదం

Published Fri, May 10 2024 10:50 PM

పోలీస్‌ వాహనానికి తప్పిన ప్రమాదం

తాడేపల్లిరూరల్‌: తాడేపల్లి– పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సీతానగరం ఎన్టీఆర్‌ కరకట్టకు మధ్య ఉన్న రైల్వే అండర్‌ పాస్‌ వద్ద గురువారం రోడ్డు ప్రమాదంలో పోలీసులకు ముప్పు తప్పింది. బైపాస్‌ రోడ్‌ నుంచి ఎన్టీఆర్‌ కరకట్ట మీదుగా ఉండవల్లి అమరావతి కరకట్ట వైపు వస్తున్న పోలీస్‌ వాహనాన్ని ఉండవల్లి సెంటర్‌ నుంచి బైపాస్‌రోడ్‌ వెళుతున్న విజయవాడ డిపోకు చెందిన అమరావతి బస్సు రైల్వే అండర్‌పాస్‌ కింద మలుపులో అతివేగంగా వచ్చి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పోలీస్‌ వాహనం ఆర్టీసీ బస్సుకన్నా చిన్నది కావడంతో పోలీస్‌ వాహనానికి తీవ్రంగా నష్టం వాటిల్లడంతో పాటు బస్సులో ప్రయాణిస్తున్న కానిస్టేబుళ్లు ముగ్గురు స్వల్పంగా గాయపడ్డారు. డ్రైవర్‌గా ఉన్న హోంగార్డ్‌ శ్యామ్‌ స్టీరింగ్‌, సీటుకు మధ్య ఇరుక్కుపోయాడు. సమాచారం అందుకున్న తాడేపల్లి ట్రాఫిక్‌ సీఐ బ్రహ్మయ్య, ఎస్‌ఐలు నారాయణ, రమేష్‌ అక్కడకు చేరుకుని ఇరుక్కుపోయిన శ్యామ్‌ను బయటకు తీసేందుకు ప్రయత్నాలు చేశారు. ఎంత ప్రయత్నించినా డ్రైవర్‌ను బయటకు తీయలేకపోవడంతో రెండు క్రేన్‌లు పిలిపించి, ఒక క్రేన్‌ను బస్సు వెనుక, మరో క్రేన్‌ను బస్సు ముందు ఏర్పాటు చేసి జాగ్రత్తగా బయటకు లాగారు. ఈ ప్రమాదంలో హోంగార్డు శ్యామ్‌ పొట్ట, కాళ్లకు స్వల్ప గాయాలు అయ్యాయి. వెంటనే పోలీస్‌ వాహనంలో గాయపడిన ఇద్దరు కానిస్టేబుళ్లతో పాటు శ్యామ్‌ను ఆస్పత్రికి తీసుకువెళ్లి ప్రథమ చికిత్స నిర్వహించారు. ప్రమాదంపై తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వాహనంలో ఇరుక్కుపోయిన హోంగార్డ్‌ 2 గంటల పాటు శ్రమించి బయటకు తీసిన పోలీసులు స్పల్ప గాయాలు కావడంతో ఊపిరిపీల్చుకున్న అధికారులు

Advertisement
 
Advertisement
 
Advertisement