కొలిక్కి రాని మద్యం షాపుల వ్యవహారం
నెహ్రూనగర్: జిల్లాలోని చాలాచోట్ల మద్యం షాపుల ఏర్పాటు మరింత ఆలస్యం అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఈ నెల 14న లాటరీ ద్వారా షాపులను దక్కించుకున్న వారు వారం పాటు తాత్కాలికంగా మద్యం విక్రయించుకునేందుకు ప్రొవిజనల్ లైసెన్స్ ఇచ్చారు. దీని గడువును ఈ నెల 31వ తేదీ వరకు పొడిగించారు. మద్యం షాపు పెట్టాలంటే వంద మీటర్ల పరిధిలో దేవాలయం, మసీదు, చర్చి, పాఠశాలలు, ఆసుపత్రులు ఉండకూడదు. గతంలో మాన్యువల్ విధానంలో షాపుల కేటాయింపు జరిగేది. ఈ సారి ఎయిర్ వ్యూ పద్ధతిలో డ్రోన్ సహయంతో వంద మీటర్లు పైబడి ఉంటేనే మద్యం షాపులు పెట్టుకోవడానికి అధికారులు అవకాశం ఇస్తున్నారు. అప్పుడే ఒరిజినల్ లైసెన్స్ జారీ చేస్తున్నారు. గుంటూరు నగరంలో మొత్తం 33 మద్యం షాపులు మంజూరు అయ్యాయి. ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో కొన్ని చోట్ల షాపులు ఏర్పాటు చేసుకోలేని పరిస్థితి నెలకొంది. ఒరిజినల్ లైసెన్స్ ఉంటేనే డిపో నుంచి మద్యం స్టాక్ ఇస్తారు. 127 దుకాణాలకుగాను 30 మందికి కూడా ఈ లైసెన్స్ రాలేదని సమాచారం. అప్పటివరకు ఉన్న స్టాక్‌ను మాత్రమే విక్రయించుకోవాలి. అధికార పార్టీకి చెందిన వారు కాకుండా ఇతరులు లాటరీలో దుకాణం దక్కించుకుంటే కూటమి నేతలు ఇబ్బంది పెడుతున్నారు. ఇంకొందరు కమీషన్ తీసుకుంటున్నారు.
జిల్లాలో ఎక్కువ శాతం దుకాణాలకు
అందని ఒరిజినల్ లైసెన్స్
నిబంధనలు పాటించాలి
గుడి, బడికి వంద మీటర్ల దూరం దాటాకే మద్యం షాపులు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎయిర్ వ్యూ (డ్రోన్ సహాయంతో గాలిలో కొలిచి, వంద మీటర్ల పరిధిలో గుడి, బడి, ఆసుపత్రి ఏమీ లేదని తేల్చుతారు.) ద్వారా షాపు పెట్టుకోవడానికి అనుమతి ఇస్తున్నాం.
– డాక్టర్ కె.శ్రీనివాస్,
డిప్యూటీ కమిషనర్, ఎకై ్సజ్ శాఖ
Comments
Please login to add a commentAdd a comment