ఫుట్‌బాల్ టోర్నీ విజేత గుంటూరు బాలుర జట్టు
సత్తెనపల్లి: రాష్ట్రస్థాయి అండర్ –19 ఫుట్‌బాల్ క్రీడా పోటీల్లో బాలుర విభాగంలో గుంటూరు జిల్లా, బాలికల విభాగంలో అనంతపురం జిల్లా జట్లు విజేతలుగా నిలిచాయి. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ – గుంటూరు, ప్రగతి జూనియర్ కళాశాల సత్తెనపల్లి ఆధ్వర్యంలో 68వ రాష్ట్ర స్థాయి అండర్–19 పోటీలు పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో మూడు రోజులపాటు జరిగాయి. ఆదివారం ఫైనల్ పోటీలు జరిగాయి. బాలుర విభాగంలో ఫైనల్స్‌లోకి ప్రవేశించిన విశాఖ జిల్లా జట్టుపై గుంటూరు జిల్లా జయకేతనం ఎగురవేసింది. కర్నూలు జిల్లా జట్టు తృతీయస్థానం , విజయనగరం జిల్లా నాలుగోస్థానంలో నిలిచాయి. బాలికల విభాగంలో ఫైనల్స్‌లోకి ప్రవేశించిన వైఎస్సార్ కడప జిల్లా జట్టుపై అనంతపురం జిల్లా జట్టు విజేతగా నిలిచింది. గుంటూరు జిల్లా తృతీయ స్థానం, విశాఖపట్నం జిల్లా నాలుగోస్థానం దక్కించుకున్నాయి. విజేతలకు కప్పుతోపాటు రోలింగ్ షీల్డ్, నగదు బహుమతులను సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రీడాభివృద్ధికి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ ౖమాజీ చెర్మన్ యెల్లినేడి రామస్వామి, నాయకులు దరువూరి నాగేశ్వరరావు, ఆళ్ల అమరేశ్వరరావు, కంభాల వెంకటేశ్వరరావు, వక్కంటి అజయ్‌కుమార్, ప్రగతి విద్యాసంస్థల అధినేత డాక్టర్ మక్కెన అచ్చయ్య, ప్రిన్సిపల్ రాయపాటి శ్రీనివాసరావు, గుంటూరు జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శి జి.నరసింహారావు, సహాయ కార్యదర్శి సీహెచ్ పద్మాకర్, ఫిజికల్ డైరెక్టర్లు ఎస్ సుధాకర్‌రెడ్డి, దాసరి కోటేశ్వరరావు, నిర్వాహకులు పుచ్చకాయల శివరామకృష్ణ, పీడీలు లాకు పిచ్చయ్య, బి అనిల్ దత్త నాయక్ తదితరులు పాల్గొన్నారు.
బాలికల విభాగం విజేత అనంతపురం రన్నర్లుగా విశాఖ, వైఎస్సార్ కడప బాలికల విభాగంలో గుంటూరుకు తృతీయ స్థానం
Comments
Please login to add a commentAdd a comment