ఆరుగురు ఎస్‌ఐలకు అటాచ్‌మెంట్
నగరంపాలెం: జిల్లాలో వీఆర్‌లో ఉన్న ఆరుగురు ఎస్‌ఐలకు అటాచ్‌మెంట్ కింద పోస్టింగ్‌లు కల్పిస్తూ జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్‌ఐలు ఎ.శివకృష్ణరావుకు అరండల్‌పేట పీఎస్, బి.విజయకుమార్‌రెడ్డికి సోషల్ మీడియా, సైబర్ క్రైం సెల్, పి.రబ్బానీకి నగరంపాలెం పీఎస్, ఎ.శ్రీనివాసరెడ్డికి తూర్పు ట్రాఫిక్ పీఎస్, పి.అనిల్‌కుమార్‌రెడ్డికి పశ్చిమ ట్రాఫిక్, ఎల్.రాములును సీసీఎస్‌కు బదలాయించారు. ఈ నెల 5న వీఆర్‌లో ఉన్న ముగ్గురు ఎస్‌ఐలకు పోస్టింగ్‌లు కల్పిస్తూ ఉత్తర్వులు వెలువడగా, తర్వాత వాటిని రద్దు చేశారు. అనంతరం కొత్తగా ఆరుగురు ఎస్‌ఐలకు అటాచ్‌మెంట్ కింద పోస్టింగ్‌లు కల్పించారు.
కార్తిక దీపోత్సవం
సత్తెనపల్లి: పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదుట గల వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి గోశాలలో ఇస్కాన్ నరసరావుపేట ఆధ్వర్యంలో శ్రీ శ్రీ దామోదర కార్తిక దీపోత్సవం ఆదివారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. తొలుత గోమాత పూజ, అనంతరం శ్రీ శ్రీ దామోదర కార్తిక దీపోత్సవం వైభవంగా నిర్వహించారు. వైష్ణవ ప్రభు ప్రత్యేక ప్రవచనం చేశారు. భక్తులు తమ స్వహస్తాలతో దామోదరునికి హారతినిచ్చే సేవ చేపట్టారు. భక్తులకు ప్రసాద వితరణ చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై శ్రీశ్రీ దామోదర మహాద్భాగ్యం పొందారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇస్కాన్ భక్త బృందం ఏర్పాట్లను పర్యవేక్షించింది.
పోలీసుల తనిఖీలు
పట్నంబజార్: గుంటూరు వెస్ట్ సబ్ డివిజన్ పరిధిలోని వెస్ట్ ట్రాఫిక్ పోలీసులు ఆదివారం సాయంత్రం గుంటూరు నగరంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా స్నేక్ డ్రైవ్, రాష్ డ్రైవ్, సైలెన్సర్లు తీసివేసి తిరుగుతున్న వాహనదారులను పట్టుకున్నారు. వెస్ట్ ట్రాఫిక్ సీఐ సింగయ్య ఆధ్వర్యంలో మొత్తం నాలుగు బైకులు స్వాధీనం చేసుకుని, చోదకులకు జరిమానాలు విధించారు.
సాగునీటి సమాచారం
తాడేపల్లిరూరల్ (దుగ్గిరాల): కృష్ణా పశ్చిమ ప్రధాన కాలువకు సీతానగరం వద్ద ఆదివారం 6830 క్యూసెక్కులు విడుదల చేశారు. హై లెవల్ కాలువకు 316 క్యూసెక్కులు, బ్యాంక్ కెనాల్‌కు 1711 క్యూసెక్కులు, తూర్పు కెనాల్‌కు 682 క్యూసెక్కులు, పశ్చిమ కెనాల్‌కు 187 క్యూసెక్కులు, నిజాంపట్నం కాలువకు 440 క్యూసెక్కులు, కొమ్మమూరు కాలువకు 3060 క్యూసెక్కులు విడుదల చేశారు.
నేటి నుంచి భవానీ దీక్షలు
15 వరకు మండల దీక్షల
స్వీకరణకు ఏర్పాట్లు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ భవానీ దీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. మండలం పాటు దీక్షలను ఆచరించే భక్తులు సోమవారం తెల్లవారుజాము నుంచి 15వ తేదీ వరకు దీక్షలను స్వీకరించనున్నారు. భక్తులు భవానీ దీక్షలను స్వీకరించేందుకు మహా మండపం ఆరో అంతస్తులో ఉత్సవ మూర్తి వద్ద, ఘాట్‌రోడ్డు ఆరంభంలోని కామధేను అమ్మవారి ఆలయం వద్ద దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. సోమవారం తెల్లవారుజామున భక్తులు పవిత్ర కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం అమ్మవారి ఆలయంతో పాటు గురు భవానీల పీఠాల వద్ద దీక్షలను స్వీకరించవచ్చునని ఆలయ వైదిక కమిటీ సభ్యులు రంగావజ్జుల శ్రీనివాసశాస్త్రి చెప్పారు. భవానీ దీక్షల ప్రారంభాన్ని పురస్కరించుకుని సోమవారం ఉదయం అమ్మవారి ఉత్సవ మూర్తికి ప్రధాన ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ మహా మండపం ఆరో అంతస్తు వరకు ఊరేగింపుగా తీసుకెళ్లనున్నారు. ఆరో అంతస్తులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై అమ్మవారు అధిష్టించిన అనంతరం పూజలు, అఖండ జ్యోతి ప్రజ్వలన చేస్తారు. తర్వాత భక్తులకు దీక్షాధారణ నిర్వహిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment