ర్యాగింగ్‌తో జీవితాలను నాశనం చేసుకోవద్దు
గుంటూరు మెడికల్: ర్యాగింగ్‌తో జీవితాలను నాశనం చేసుకోవద్దని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, గుంటూరు కార్యదర్శి టి.లీలావతి చెప్పారు. మంగళవారం గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాలను లీలావతి సందర్శించి న్యాయ విజ్ఙాన సదస్సు నిర్వహించారు. ర్యాగింగ్ విష సంస్కృతి అని పేర్కొన్నారు. ర్యాగింగ్ చేయడం నేరమని స్పష్టం చేశారు. దుష్పరిణామాలను వివరించారు. యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్ ప్రతి కాలేజీలో అందుబాటులో ఉండాలని చెప్పారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని హితవు పలికారు. ప్యానెల్ అడ్వకేట్ కట్టా కాళిదాసు మాట్లాడుతూ ర్యాగింగ్ నివారణ కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలో వివరించారు. గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్.వి.సుందరాచారి, వైస్ ప్రిన్సిపాల్స్ డాక్టర్ బి.శ్రీధర్, డాక్టర్ కె.ప్రభాకరరావు పాల్గొన్నారు.
జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి లీలావతి
Comments
Please login to add a commentAdd a comment