న్యాయవాద వృత్తిలో ఎన్నో సవాళ్లు
చేబ్రోలు: ప్రపంచంలోనే మన రాజ్యాంగం మహోన్నతమైనదని ఏపీలోని అమరావతి హైకోర్టు జస్టిస్ జి.రామకృష్ణప్రసాద్ అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ లా డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం ప్రత్యేక అతిథి ఉపన్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు న్యాయ శాస్త్రాన్ని అభ్యసించి సమాజంలోని ప్రతి ఒక్కరికీ న్యాయం దక్కేలా కృషి చేయాలన్నారు. రోజూ కొత్త విషయాలను, టెక్నాలజీలను నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలన్నారు. న్యాయవాది వృత్తి సవాళ్లతో కూడుకున్నదని తెలిపారు. విజ్ఞాన్ విద్యాసంస్థల చైర్మన్ లావు రత్తయ్య మాట్లాడుతూ వ్యవసాయం, పరిశ్రమలు, హోటల్స్, స్పోర్ట్స్, ఎంటర్‌టైన్‌మెంట్ వంటి రంగాలలో న్యాయశాస్త్రం చదివిన విద్యార్థులకు డిమాండ్ పెరిగిందన్నారు. వివిధ కార్యక్రమాల్లో సత్తాచాటిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలను, నగదు బహుమతులను అందజేశారు. వైస్ చాన్సలర్ పి.నాగభూషణ్, రిజిస్ట్రార్ ఎంఎస్ రఘునాథన్ తదితరులు పాల్గొన్నారు.
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జి.రామకృష్ణ ప్రసాద్
Comments
Please login to add a commentAdd a comment