7న విజ్ఞాన్స్ వర్సిటీ ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ రెండో స్నా
చేబ్రోలు: విజ్ఞాన్ యూనివర్సిటీలో ఆన్‌లైన్ లెర్నింగ్, ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్‌లో ఎంసీఏ, ఎంబీఏ పూర్తి చేసిన విద్యార్థులకు డిసెంబర్ 7న శనివారం 2వ స్నాతకోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు వైస్ చాన్స్‌లర్ పి.నాగభూషణ్ బుధవారం తెలిపారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో వైస్ చాన్స్‌లర్ పి.నాగభూషణ్, రిజిస్ట్రార్ ఎంఎస్ రఘునాథన్, ఆయా విభాగాల డీన్లు, తదితరులు స్నాతకోత్సవ ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించారు. వైస్ చాన్స్‌లర్ మాట్లాడుతూ డిసెంబర్ 7న జరిగే 2వ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హైదరాబాద్‌లోని నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ శ్రీక్రిష్ణ దేవరావు హాజరవుతారని తెలిపారు. 2వ స్నాతకోత్సవం సందర్భంగా తమ యూనివర్సిటీ 858 (ఎంబీఏ–668, ఎంసీఏ–190) మంది ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేయనుందని తెలిపారు. 2వ స్నాతకోత్సవంలో విజ్ఞాన్ విద్యాసంస్థల చైర్మన్, చాన్స్‌లర్ లావు రత్తయ్య, వైస్ చైర్మన్ శ్రీకృష్ణదేవరాయలు, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు, అకడమిక్ కౌన్సిల్, ఆయా విభాగాల డీన్లు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొంటారని వీసీ నాగభూషణ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment