ఐఎంఏ జాతీయ ఉత్తమ కార్యదర్శిగా డాక్టర్ నరేంద్ర రెడ్డి
గుంటూరు మెడికల్: ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జాతీయ ఉత్తమ కార్యదర్శిగా సీనియర్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్, సాయి భాస్కర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ బూసిరెడ్డి నరేంద్ర రెడ్డి ఎంపికయ్యారు. 2023–2024 సంవత్సరానికి గుంటూరు బ్రాంచ్‌ను జాతీయస్థాయిలో పలు విభాగాల్లో ఉత్తమ పనితీరు కనబరిచేలా తీర్చిదిద్దినందుకు డాక్టర్ బూసిరెడ్డిని ఈ అవార్డు వరించింది. ఈ మేరకు బుధవారం ఢిల్లీలోని ఐఎంఏ ప్రధాన కార్యాలయం నుంచి ఉత్తర్వులు అందాయి. వచ్చేనెల డిసెంబర్ 27న హైదరాబాద్‌లో జరగనున్న ఐఎంఏ జాతీయ సమావేశాల్లో డాక్టర్ నరేంద్రరెడ్డికి ఈ అవార్డును అందజేయనున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా డాక్టర్ బూసిరెడ్డి అనేక కార్యక్రమాలు చేపట్టి గుంటూరు బ్రాంచ్‌కు జాతీయస్థాయిలో గుర్తింపు తీసుకువచ్చారు. గుంటూరు బ్రాంచ్ చరిత్రలో నిలిచిపోయేలా విజయవాడ వరదల సమయంలో ఆపన్నులను ఆదుకునేందుకు సుమారు రూ. 15 లక్షలకుపైగా వైద్యుల నుంచి సేకరించి రాష్ట్ర శాఖ ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్‌కు అందజేశారు. వరదల కారణంగా బరదమయమైన గృహాలను శుభ్రపరిచేందుకు 50కిపైగా హై ప్రెజర్ పంపులను సేకరించి అగ్నిమాపక శాఖకు అందజేశారు. ఈ విషయమై జాతీయ స్థాయి నుంచి ప్రశంసలు అందాయి. అలాగే డాక్టర్స్ దివాళి సెలబ్రేషన్స్, ఇఫ్తార్ విందు, ఆర్ జి కర్ నిరసన కార్యక్రమాలను తనదైన శైలిలో నిర్వహించి గుంటూరు బ్రాంచ్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చారు. ఉత్తమ కార్యదర్శిగా ఎంపికై న డాక్టర్ బూసిరెడ్డి నరేంద్ర రెడ్డిని ఐఎంఏ రాష్ట్ర, స్థానిక నాయకులు, వైద్యులు, అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment