పోస్టల్‌ ఠార్‌గెట్స్‌ | - | Sakshi
Sakshi News home page

పోస్టల్‌ ఠార్‌గెట్స్‌

Published Thu, Nov 28 2024 1:44 AM | Last Updated on Thu, Nov 28 2024 1:44 AM

పోస్ట

పోస్టల్‌ ఠార్‌గెట్స్‌

తపాలా శాఖలో బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ పేరుతో అసాధ్యమైన టార్గెట్లను పూర్తి చేయాలని ఉన్నతాధికారి ఒకరు కింది స్థాయి సిబ్బందిపై తీవ్ర ఒత్తిడి పెంచుతున్నారు. విజయవాడ సర్కిల్‌ కార్యాలయానికి చెందిన ఆ అధికారి ఒక అడుగు ముందుకేసికేంద్ర సహాయ మంత్రి వద్ద, తన పైఅధికారుల మెప్పు కోసం యత్నిస్తున్నారు. మంత్రి అండదండలు ఉన్నాయని చెబుతూ ఉద్యోగులను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నట్లు సమాచారం.

లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్‌): పోస్టల్‌ శాఖ విజయవాడ రీజియన్‌ కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా పని చేస్తున్న అధికారి ఆంధ్రప్రదేశ్‌ పోస్టల్‌ సర్కిల్‌ బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ విభాగ ఇన్‌చార్జిగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన విజయవాడ రీజియన్‌ పరిధిలోని కిందిస్థాయి సిబ్బందిని ఆర్థిక లక్ష్యాలు(టార్గెట్ల) పేరుతో వేధిస్తున్నారు. తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు. దీంతో రీజియన్‌ పరిధిలోని నెల్లూరు, ప్రకాశం, మార్కాపురం, గుంటూరు, తెనాలి, పల్నాడు, విజయవాడ, భీమవరం, మచిలీపట్నం, ఏలూరు కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు బెంబేలెత్తిపోతున్నారు. సుమారు 20 ఏళ్లుగా పనిచేస్తున్న తమను ఇన్‌చార్జి కులం పేరు చెప్పి బెదిరిస్తున్నాడని లబోదిబోమంటున్నారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా టార్గెట్లు పూర్తి చేయించడంలో ఆరితేరిన వ్యక్తిగా ఆ అధికారి పేరు పొందడంతో ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదని చెబుతున్నారు. పైగా గతంలో ఈ అధికారి ఐపీఏఎస్‌పీ అసోసియేషన్‌ సెక్రటరీగా సుదీర్ఘకాలం పనిచేశారని పేర్కొంటున్నారు.

బలవంతంగా ఖాతాలు తెరవాల్సిందే..

పోస్టల్‌ సేవింగ్స్‌ ఖాతాలు పెంచాలని ఆ అధికారి ఒత్తిడి చేస్తుండడంతో ఉద్యోగులు బలవంతంగా వేలల్లో ఖాతాలు తెరుస్తున్నారు. దీనికోసం చేతిచమురు వదిలించుకుంటున్నారు. అయినా ఇంకా ఖాతాలు పెంచాలని ఆ అధికారి తీవ్ర ఒత్తిడి చేస్తు న్నారు. ఇన్సూరెన్సు లక్ష్యాలూ విధిస్తున్నారు. ఫలితంగా ఉద్యోగులు ఆందోళనల బాట పట్టారు. 90 శాతం ఉద్యోగులపై టార్గెట్ల ఒత్తిడి ఉందని యూనియన్‌ నాయకులు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, ధర్నాలు చేశారు. అయినా ఉన్నతాధికారుల్లో చలనం లేదు.

ఆర్థిక లక్ష్యాల పిడుగు

కింది స్థాయి ఉద్యోగులపై తీవ్ర ఒత్తిడి వివాదాస్పదంగా బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ విభాగ ఇన్‌చార్జి తీరు ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా ఫలితం శూన్యం సొంత డబ్బు వెచ్చించాల్సిన దుస్థితిలో సిబ్బంది సాధ్యం కాని టార్గెట్లు ఇవ్వొద్దని వినతి

ఒత్తిడి తట్టుకోలేక మరణాలు

ఉత్తరాల బట్వాడా సిబ్బందిని బిజినెస్‌ టార్గెట్లకు వినియోగించవద్దని, డెలివరీ శాతం పెంచాలని పోస్టల్‌ శాఖ ఉన్నతాధికారుల నుంచి ఉత్తర్వులు ఉన్నా.. ఆ అధికారి పెడచెవిన పెడుతున్నాడు. టార్గెట్‌లు పూర్తి చేయాల్సిందేనని, బీమాలు చేయించాల్సిందేనని కిందిస్థాయి ఉద్యోగులపై ఒత్తిడి తెస్తున్నాడు. ఈ ఒత్తిడి తట్టుకోలేక రెండేళ్ల క్రితం మచిలీ పట్నం టౌన్‌లో పనిచేసే సబ్‌ పోస్ట్‌మాస్టర్‌ గుండెపోటుతో మరణించారు. అనంతపురం జిల్లా కళ్యాణ దుర్గం మండలం, హులికల్లు కొండలో మరో పోస్టుమాస్టర్‌ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఇదిలా ఉంటే సంస్థాగతంగా నెలకొన్న కంప్యూటర్‌ నెట్‌వర్క్‌ సమస్యలను మాత్రం ఆ అధికారి పట్టించుకోవడం లేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నా దృష్టికి రాలేదు

గుంటూరు డివిజన్‌ పరిధిలో ఉద్యోగులపై తీవ్ర టార్గెట్ల ఒత్తిడి ఉన్న విషయం నా దృష్టికి రాలేదు. విధి నిర్వహణలో ఇది ఒక భాగం. యూనియన్‌ నాయకులు చేసిన ధర్నాలు దేశవ్యాప్తంగా చేసినవి.

– యలమందయ్య, గుంటూరు డివిజనల్‌ పోస్టల్‌ సూపరింటెండెంట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
పోస్టల్‌ ఠార్‌గెట్స్‌ 1
1/2

పోస్టల్‌ ఠార్‌గెట్స్‌

పోస్టల్‌ ఠార్‌గెట్స్‌ 2
2/2

పోస్టల్‌ ఠార్‌గెట్స్‌

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement