ఏఎన్‌యూ లిఫ్టర్ రేణుకకు బంగారు పతకం
ఏఎన్‌యూ: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో జరుగుతున్న సౌత్, వెస్ట్ జోన్ అంతర విశ్వవిద్యాలయాల మహిళల వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో బుధవారం ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వెయిట్ లిఫ్టర్ రేణుక బంగారు పతకాన్ని సొంతం చేసుకున్నారు. మహిళల 76 కేజీల కేటగిరీలో మొత్తం 205 కేజీల బరువు ఎత్తిన రేణుక ప్రథమ స్థానంలో నిలిచారు. పోటీల వివరాలను ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆచార్య పీపీఎస్ పాల్‌కుమార్ వెల్లడించారు. వీసీ ఆచార్య గంగాధరరావు, రిజిస్ట్రార్ ఆచార్య జి. సింహాచలం పోటీలను పర్యవేక్షించి వెయిట్ లిఫ్టర్లను అభినందించారు. టెక్నికల్ టీం చీఫ్ బడేటి వెంకట్రామయ్య, ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి.సూర్యనారాయణ, డాక్టర్ యిన్నయ్య, డాక్టర్ రామ్మోహనరావు పాల్గొన్నారు.
పలు విభాగాల్లో వరుస మూడు స్థానాల్లో నిలిచిన విజేతలు ఇలా..
71 కేజీల కేటగిరీ: సనపత్తి పల్లవి (ఆంధ్ర యూనివర్సిటీ), బి.నాని (ఆచార్య నాగార్జున యూనివర్సిటీ), ఎం.తనూష (మంగుళూరు యూనివర్సిటీ).
64 కేజీల కేటగిరీ: కామ్ బ్లీ హిమాలి నగేష్(భారతీ విద్యాపీఠ్ యూనివర్సిటీ), మోహితే భూమిక రాజేంద్ర (శివాజీ యూనివర్సిటీ), కౌశికల్ (అన్నామలై యూనివర్సిటీ).
59 కేజీల కేటగిరీ: సాక్షి రమాలే (భారతీ విద్యాపీ ఠ్ యూనివర్సిటీ), కనికశ్రీ వీఆర్ (భారతీయార్ యూనివర్సిటీ, కందుకూరి హైమావతి (జేఎన్‌టీయూ కాకినాడ).
Comments
Please login to add a commentAdd a comment