అమరావతిలో రిపబ్లిక్ డే వేడుకలు!
రాయపూడి(తాడికొండ): అమరావతి రాజధానిలో రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీనిలో భాగంగా బుధవారం తుళ్లూరు మండలం రాయపూడిలో రిపబ్లిక్ డే వేడుకల నిర్వహణకు అనువైన స్థలం కోసం అధికారులు అన్వేషించారు. ముఖ్యమంత్రి కార్యాలయ అధికారి సురేష్కుమార్, గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, సీఆర్డీఏ కమిషనర్ కాటమనేని భాస్కర్, ఇతర అధికారుల ఆధ్వర్యంలో రాయపూడి గ్రామంలో నాన్ రెసిడెన్షియల్ టవర్స్ నిర్మాణం కోసం కేటాయించిన ఐదు ఎకరాల స్థలాన్ని పరిశీలించారు. ఈ ప్రాంతం రిపబ్లిక్ డే వేడుకలకు అనుకూలంగా ఉంటుందా లేదా అనే విషయంపై చర్చించి ఇతర అనుకూల ప్రాంతాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో వారి వెంట లా అండ్ ఆర్డర్ అదనపు ఎస్పీ టీవీ రవికుమార్, డీఎస్పీ మురళీ కృష్ణ, పలువురు అధికారులు పాల్గొన్నారు.
రాయపూడి వద్ద స్థలం పరిశీలన
Comments
Please login to add a commentAdd a comment