24/7 పోలీస్ సేవలు
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): 24 గంటలూ పోలీస్ సేవలు అందించాలని, దీనికోసం సిబ్బంది చిత్తశుద్ధితో పనిచేయాలని ఎస్పీ సతీష్‌కుమార్ సూచించారు. మంగళవారం అర్ధరాత్రి గుంటూరు నగరంలోని పట్టాభిపురం, నల్లపాడు, అరండల్‌పేట, కాకాని పోలీస్ స్టేషన్లలో తనిఖీలు చేశారు. స్టేషన్లలో రిసెప్షన్ కేంద్రాలను పరిశీలించారు. రాత్రి విధుల్లో ఉన్న సిబ్బందితో మాట్లాడారు. ఫిర్యాదుదారులతో ఎలా వ్యవహరిస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. నిందితులను లాకప్‌లో ఉంచితే పర్యవేక్షణ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌పై అవగాహన కల్పించారు. పెదకాకాని పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్‌హెచ్16 హైవేపై ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జాతీయ రహదారుల అథారిటీ వారితో సమన్వయం చేసుకుని ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రదేశాలను బ్లాక్ స్పాట్లుగా గుర్తించి అక్కడ ప్రమాద హెచ్చరికలను, సూచికలను, గుర్తులను ఏర్పాటు చేయాలని సీఐ నారాయణ స్వామికి సూచించారు. పోలీస్ స్టేషన్ రికార్డుల నిర్వహణ–భద్రత ఎలా ఉందో తెలుసుకుని, వివిధ కేసుల్లో సీజ్ చేసిన వాహనాల వివరాలు, వాటి విడుదలకు తీసుకుంటున్న చర్యలు తదితర అంశాల గురించి ఆరా తీశారు.
ఎస్పీ సతీష్‌కుమార్ అర్ధరాత్రి పోలీస్ స్టేషన్ల తనిఖీ ఫ్రెండ్లీ పోలీసింగ్‌పై అవగాహన
Comments
Please login to add a commentAdd a comment