గొట్టిపాడు ‘సంఘ’ర్షణ
ప్రత్తిపాడు: వెలుగు సీసీ శ్రీనివాసరావు తీరుపై గొట్టిపాడు డ్వాక్రా మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక వెలుగు కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమీక్ష సమావేశానికి గొట్టిపాడు గ్రామంలోని రాధాకృష్ణ గ్రామ సంఘానికి గానీ, కార్యవర్గానికి గానీ, వీవోఏకు గానీ కనీసం సమాచారం ఇవ్వకపోవడంతో సంఘ సభ్యురాలు శివకుమారితోపాటు కొందరు మహిళలు ప్రత్తిపాడుకు వచ్చి సమావేశంలోనే అధికారుల తీరుపై నిప్పులు చెరిగారు. ప్రస్తుతం ఉన్న వీవోఏను కాదని, కొత్త వీవోఏను తీసుకునేందుకు యత్నాలు జరుగుతున్నాయని సీసీ చెబుతున్నారని, అసలు గ్రామ సంఘంతో, గ్రామ సభ్యులతో సంబంధం లేకుండా కొత్త వీవోఏను ఎలా తీసుకుంటారని సీసీని, అధికారులను ప్రశ్నించారు. తమ సంఘంపై పక్క సంఘ వీవోఏ ఆధిపత్యం ఏమిటని నిలదీశారు. దీంతో ఏపీఎం లాజరు కల్పించుకుని తరువాత మాట్లాడుదామని శివకుమారికి సర్దిచెప్పేందుకు యత్నించినా మహిళలు శాంతించలేదు. సభ్యులమంతా కలిసి ఓ వీవోఏను ఎన్నుకున్నామని, దీనిని కాదని 2021లో అవినీతి ఆరోపణలతో తొలగించిన ఒక వీవోఏను ఏపీఎం, సీసీ తీసుకురావడం ఏమిటని ప్రశ్నించారు. దీనిపై చర్యలు తీసుకోవాలంటూ మండల సమాఖ్య అధ్యక్షురాలు మరియమ్మకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
సూక్ష్మ రుణ సంస్థల ఉచ్చులో మహిళలు
అనంతరం కొనసాగిన సమీక్ష సమావేశంలో ఏపీఎం లాజరు మాట్లాడుతూ సూక్ష్మ రుణ సంస్థల ఉచ్చులో మహిళలు చిక్కుకున్నారని పేర్కొన్నారు. ప్రత్తిపాడులో ఒక్క ఆదర్శ మహిళా వీవో నుంచి 40 గ్రూపులు రూ. 2 కోట్లు మైక్రో ఫైనాన్స్ సంస్థల నుంచి 34 శాతం వడ్డీకి తీసుకున్నాయని చెప్పారు. రుణాలు తీసుకున్న వారిలో ఎస్సీ, ఎస్టీ, బీసీలే అధికంగా ఉన్నారని, వీరంతా రోజువారీ కష్టపడేవాళ్లేనని పేర్కొన్నారు. వారికి డ్వాక్రా రుణాలిప్పించి మైక్రో ఫైనాన్స్ సంస్థల బారి నుంచి విముక్తి కల్పించాలని చెప్పారు. ఇప్పటి వరకు ఆ వీవోకు బ్యాంకు లింకేజీ కింద రూ. 6.50 కోట్లు, సీ్త్రనిధి ద్వారా రూ. 40 లక్షల రుణాలిచ్చినా వారు మైక్రో ఫైనాన్స్ సంస్థల కోరల్లో చిక్కుకోవడం బాధాకరమన్నారు.
వెలుగు సీసీ తీరుపై మహిళల ఆగ్రహం గ్రూపులపై ఆధిపత్యం ఏమిటని నిలదీత తాము ఎన్నుకున్న వీవోఏను కాదని, అవినీతి ఆరోపణలున్న వీవోఏను ఎలా తీసుకుంటారని మండిపాటు సమావేశం గురించి సమాచారం ఇవ్వకపోవడంపైనా నిరసన
Comments
Please login to add a commentAdd a comment