గుంటూరు ఎడ్యుకేషన్: ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ కల్పిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి కొండా సంజీవరావు బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. నల్లపాడులోని ఎంబీటీఎస్ ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో ఏర్పాటు చేసిన స్కిల్ హబ్‌లో డొమెస్టిక్ ఐటీ హెల్ప్ డెస్క్ అటెండెంట్ కోర్సులో డిసెంబన్ 4న ప్రారంభించనున్న శిక్షణ తరగతులకు టెన్త్, ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగ యువతీ, యువకులు డిసెంబర్ 3వ తేదీలోపు పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. వివరాలకు 63042 92828 నంబర్లో సంప్రదించాలని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment