నల్లపాడు పోలీస్ స్టేషన్ను పరిశీలించి, రాత్రి విధుల్లో ఉండే పోలీస్ అధికారులు, సిబ్బంది ముమ్మరంగా గస్తీ చేపట్టాలని ఆదేశించారు. అరండల్ పేట పోలీస్ స్టేషన్ను పరిశీలించి రాత్రి విధుల సిబ్బందికి సూచనలు చేశారు. అనతంరం బ్రాడీపేటలోని పలు వీధుల్లో తనిఖీలు చేపట్టారు. అర్ధరాత్రి అనవసరంగా రోడ్లపై తిరుగుతున్న వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. రాత్రి 11 గంటలు దాటితే తప్పనిసరిగా అన్ని షాపులూ మూసివేయాలని, నిర్ణీత సమయం దాటిన తర్వాత టిఫిన్ సెంటర్ నిర్వహిస్తున్న యజమానికి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ తనిఖీల్లో ఎస్పీతోపాటు జిల్లా అదనపు ఎస్పీ(ఏఆర్) హనుమంతు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment