నెహ్రూనగర్: బీసీల అభ్యున్నతికి మహాత్మ జ్యోతిరావు పూలే ఎనలేని కృషి చేశారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు పేర్కొన్నారు. గురువారం పూలే వర్ధంతిని పురస్కరించుకుని జిల్లా పార్టీ కార్యాలయంలో పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంబటి మాట్లాడుతూ పూలే బాటలోనే గత వైఎస్సార్‌సీపీ పాలనలో మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చామన్నారు. వారు ఆర్థికంగా నిలదొక్కుకోగలిగితే ఆ కుటుంబం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మహిళలకు పెద్ద పీట వేశారన్నారు. ఆనాటి మహనీయుల భావజాలంతో ముందుకు సాగుతున్న పార్టీ తమదని పేర్కొన్నారు. పార్టీ గుంటూరు, నరసరావుపేట పార్లమెంటరీ నియోజకవర్గాల పరిశీలకులు మోదుగుల వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, మహాత్మ జ్యోతిరావు పూలే చరిత్రలో చిరస్మరణీయులుగా నిలిచిపోయారని కొనియాడారు. వెనుకబడిన వర్గాల వారికి వైఎస్ జగన్ పాలనలో అధిక ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. ‘నా ఎస్సీ, బీసీ, ఎస్టీలని’ చెప్పి అక్కున చేర్చుకున్నారని గుర్తుచేశారు. వారికి కొండంత భరోసా కల్పించారన్నారు. వైఎస్సార్‌సీపీ అంటే అన్నివర్గాల పార్టీ అని చెప్పారు. ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం మాట్లాడుతూ హిందూ కాలేజీ సెంటర్‌లో పూలే విగ్రహం పక్కనే ఆయన సతీమణి సావిత్రిబాయి విగ్రహం ఏర్పాటు చేయాలని కోరారు. పార్టీ నగర అధ్యక్షుడు, తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త, డిప్యూటీ మేయర్ వనమా బాలవజ్రబాబు, గుంటూరు తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరిఫాతిమా, ప్రత్తిపాడు నియోజకవర్గ సమన్వయకర్త బాలసాని కిరణ్‌కుమార్‌లు మాట్లాడుతూ పూలే తన జీవితాంతం బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికే కృషి చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు నిమ్మకాయల రాజనారాయణ, రాతంశెట్టి సీతారామాంజనేయులు (లాల్‌పురం రాము), మాదిరెడ్డి శ్రీనివాసులరెడ్డి, రామనబోయిన అజయ్, ఫర్జాన, బత్తుల దేవానంద్, అంగడి శ్రీను, దేవళ్ల వెంకట్, మండేపూడి పురుషోత్తం, కొరిటెపాటి ప్రేమ్‌కుమార్, అగ్గిపెట్టె రాజు, మర్రి సత్యనారాయణ, తుమ్మేటి శ్రీను, హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు
Comments
Please login to add a commentAdd a comment