ఏ–గ్రేడ్ ధాన్యం మద్దతు ధర క్వింటాకు రూ.2,320
గుంటూరు వెస్ట్ : రైతులు ధాన్యాన్ని తక్కువ ధరకు దళారులకు విక్రయించవద్దని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ సూచించారు. ఏ–గ్రేడ్ ధాన్యం మద్దతు ధర క్వింటాకు రూ.2,320గా నిర్ణయించినట్లు తెలిపారు. గురువారం స్థానిక కలెక్టరేట్‌లో అధికారులు, రైస్ మిల్ యజమానులతో నిర్వహించిన సమావేశంలో జేసీ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఎ–గ్రేడ్ ధాన్యానికి కనీసం మద్దతు ధర క్వింటాకు రూ.2,320, కామన్ రకానికి రూ.2,300 అందిస్తుందన్నారు. అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలకు వెనుకాడనని జేసీ హెచ్చరించారు. సమావేశంలో డీఎస్‌ఓ కోమలి పద్మ, సివిల్ సప్‌లైస్ డీఎం లక్ష్మి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment