బాలిక హత్య కేసులో నిందితుడి పట్టివేత?
చేబ్రోలు: చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెం గ్రామానికి చెందిన దళిత విద్యార్థిని హత్య కేసులో నిందితుడైన గ్యాస్ డెలివరీ బాయ్ నాగరాజు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. జూలై 15వ తేదీన జరిగిన పేరుపోగు శైలజ హత్య ఘటన సంచలనం కలిగించింది. స్థానిక ప్రాథమిక పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న శైలజను అదే ప్రాంతంలో ఉండే నాగరాజు హత్య చేసి పరారయ్యాడు. ఐదు నెలలుగా పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న నిందితుడిని ఎట్టకేలకు అదుపులోకి తీసుకోగలిగారు. పొన్నూరు రూరల్ సీఐ వై.కోటేశ్వరరావు, చేబ్రోలు ఎస్‌ఐ వెంకటకృష్ణ, సిబ్బంది కలిసి రాజమండ్రి సమీపంలో అక్కడి పోలీసుల సహాయంతో రెండు రోజుల క్రితం అదుపులోకి తీసుకున్నారు. కొంతకాలంగా రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో స్పిన్నింగ్, తాపీ పనులు చేసుకుంటూ ఉంటున్నాడని తెలిసింది. నాగరాజుకు గతంలో కూడా నేర చరిత్ర ఉండటంతో సాంకేతిక పరిజ్ఞానానికి కూడా చిక్కకుండా జాగ్రత్తపడ్డాడు. కరోనా సమయంలో చేబ్రోలు ప్రాంతానికి వచ్చి బతుకు దెరువు కోసం హోటల్ కార్మికుడిగా చేరాడు. కొంత కాలానికి గ్యాస్ కంపెనీలో రోజువారీ కూలీగా పనిచేశాడు. కొత్తరెడ్డిపాలెం దళితవాడ ప్రాంతంలో ఇల్లు అద్దెకు తీసుకుని ఉండేవాడు. కృష్ణా జిల్లా కొండపల్లికి చెందిన అతడిపై ఆ ప్రాంతంలో హత్య, హత్యాయత్నం కేసులు ఉన్నాయి. పథకం ప్రకారం బాలికను హత్య చేసి రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో సంచరించాడు. నాగరాజు అరెస్టును రెండు రోజుల్లో చూపే అవకాశం ఉంది.
ఐదు నెలలుగా చిక్కని గ్యాస్ డెలివరీ బాయ్ ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్న పోలీసులు
Comments
Please login to add a commentAdd a comment