అక్రమ మద్యం అమ్ముతున్న ఇద్దరి అరెస్టు | Sakshi
Sakshi News home page

అక్రమ మద్యం అమ్ముతున్న ఇద్దరి అరెస్టు

Published Mon, May 6 2024 3:35 AM

అక్రమ మద్యం అమ్ముతున్న ఇద్దరి అరెస్టు

రామన్నపేట : అక్రమ మద్యం అమ్ముతున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీ ఎ.మధుసూదన్‌ తెలిపారు. నగరంలోని మట్టెవాడ పీఎస్‌ పరిధిలోని మట్టెవాడ తుమ్మలకుంటకు చెందిన వన్నాల సునీత, వన్నాల సంధ్య ఇంట్లోనే బెల్ట్‌షాపు నిర్వహిస్తూ అక్రమంగా మద్యం అమ్ముతున్నారు. దీనిపై విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఆదివారం దాడులు నిర్వహించి రూ.11,730 మద్యం స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను అరెస్టు చేసి తదుపరి చర్యల నిమిత్తం మట్టెవాడ పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు. ఇన్‌స్పెక్టర్లు ఎస్‌.రవికుమార్‌, ఏఎస్సై కృష్ణారావు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
Advertisement