ఒత్తిడే కారణమా? | - | Sakshi
Sakshi News home page

ఒత్తిడే కారణమా?

Published Wed, Nov 20 2024 1:26 AM | Last Updated on Wed, Nov 20 2024 1:26 AM

-

ఎంజీఎం: ఎంజీఎం ఆస్పత్రిలో కొన్నేళ్లుగా ఎవరికి వారే యమునా తీరే అన్నచందంగా అధికారులు, కిందిస్థాయి సిబ్బంది వ్యవహరిస్తున్నారు. దీంతో ఎవరిపై చర్యలు తీసుకోలేక ఒత్తిడికి గురైన సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మురళి తన పదవికి రాజీనా మా చేశారని ఆస్పత్రిలో పలువురు చర్చించుకుంటున్నారు. కుటుంబ సమస్యలు, అనారోగ్య కారణాలతో రాజీనామా చేశానని ఆయన పేర్కొన్నారు. సహకరించని సిబ్బంది, అసిస్టెంట్‌ డెరెక్టర్‌, ఆర్‌ఎంఓల మధ్య ఏర్పడిన సమస్వయ లోపం సూపరింటెండెంట్‌కు తలనొప్పి తెచ్చిపెట్టింది. ఇటీవల నిర్వహించిన డైట్‌ టెండర్ల ప్రక్రియలో కూడా పలు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ పదవి వద్దు.. అని కొన్ని రోజుల క్రితం ఆయన సెలవుపై వెళ్లారు. సోమవారం సాయంత్రం కేఎంసీ ప్రిన్సిపాల్‌ రాంకుమార్‌రెడ్డికి తన రాజీనామా లేఖను అందించారు. రాజీనామా పత్రాన్ని డీఎంఈకి పంపించామని, డీఎంఈ నిర్ణయంపై రాజీనామా ఆమోదం ఆధారపడి ఉంటుందని ప్రిన్సిపాల్‌ పేర్కొన్నారు.

అసలేం జరిగింది?

ఎంజీఎం సూపరింటెండెంట్‌గా పనిచేసిన చంద్రశేఖర్‌ జూలై చివరి వారంలో బదిలీపై ములుగు వెళ్లారు. సీనియార్టీ ప్రకారం కొత్త సూపరింటెండెంట్‌ను నియమించే వరకు ఇన్‌చార్జ్‌గా కొనసాగాలని అనస్థీషియా ప్రొఫెసర్‌ డాక్టర్‌ మురళికి బాధ్యతలు అప్పగించారు. ఆస్పత్రిలో మెరుగైన సేవల కోసం జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పర్యటన అనంతరం కలెక్టర్‌ డాక్టర్‌ సత్య శారద ఎంజీఎం ఆస్పత్రిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలో ఆర్‌ఎంఓ–1 పోస్టు కొద్ది నెలలుగా ఖాళీగా ఉండడం, పెద్ద ఎత్తున సమస్యలు పేరుకుపోవడం, ఆస్పత్రిలో వరుసగా చోటు చేసుకుంటున్న ఘటనలతో మనస్తాపానికి గురైన డాక్టర్‌ మురళి పదవికి రాజీనామా చేయడం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖలో కలకలం రేపింది. కాగా, ప్రస్తుతం ఇన్‌చార్జ్‌ సూపరింటెండెంట్‌గా ఆర్థోపెడిక్‌ వైద్యుడు కొనసాగుతున్నారు.

ఎంజీఎం సూపరింటెండెంట్‌

మురళి రాజీనామాపై ఆస్పత్రిలో చర్చ

అనారోగ్యమే కారణమని

లేఖలో పేర్కొన్న అధికారి

సహకరించని సిబ్బంది..

వరుస ఘటనలతో మనస్తాపం

ఏడీ, ఆర్‌ఎంఓల మధ్య లోపించిన సమన్వయం

జిల్లా వైద్యశాఖ వర్గాల్లో కలకలం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement