‘గ్రేటర్ వరంగల్’కు మరో రూ.187.42 కోట్లు
జీఓ జారీ చేసిన ప్రభుత్వం
వరంగల్ అర్బన్ : వరంగల్ నగరానికి నిధుల వరద పారుతోంది. రెండు రోజులుగా వివిధ పథకాల కింద నగరానికి రూ.4,252 కోట్ల నిధులు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం సాయంత్రం 2024–25 ఆర్థిక సంవత్సరానికి రూ.187.42 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు రాష్ట్ర పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిశోర్ జీఓ 583 ఉత్తర్వులు జారీ చేశారు. మహానగరానికి ఇంత భారీ మొత్తంలో నిధుల కేటాయింపు, విడుదల కావడం ఇదే మొదటిసారి. తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇంత పెద్ద మొత్తంలో నిధులు విడుదల చేసిన దాఖలాలు లేవు. ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి.. హైదరాబాద్ తర్వాత వరంగల్ నగరాన్ని రెండో రాజధానిగా, ఉత్తర తెలంగాణకు కేంద్రంగా తీర్చిదిద్దుతానని ప్రకటించారు. అందుకు అనుగుణంగానే నిధులు కేటాయించారు. తాజాగా అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీకి రూ.4,170 కోట్లు, ప్రధాన కార్యాలయ ఆవరణలో పరిపాలన భవనం (అడినిస్ట్రేటివ్ టవర్స్)కు రూ.32.50 కోట్లు, రోడ్ల విస్తరణ, అభివృద్ధికి రూ.49.50 కోట్లు కేటాయించింది. అభివృద్ధికి అన్ని వనరులు అనుకూలంగా ఉండడంతో హైదరాబాద్‌కు దీటుగా వరంగల్ నగరాన్ని అ భివృద్ధి చేస్తామనే హామీలు సాకారమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment