హన్మకొండ అర్బన్: జిల్లా ప్రజలు, కళాకారులు, కళాభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కాళోజీ కళాక్షేత్రాన్ని మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి హనుమకొండ ‘కుడా’ మైదానంలో ఏర్పాటు చేసిన హెలిపాడ్ వద్దకు ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా చేరుకున్న సీఎం రేవంత్‌రెడ్డి ముందుగా పోలీసులనుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా కాళోజీ కళాక్షేత్రానికి చేరుకుని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులతో కలిసి ప్రజా కవి కాళోజీ నారాయణరావు నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం హనుమకొండ, వరంగల్ జిల్లాలకు సంబంధించి రూ.4601.15 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు వర్చువల్‌గా చేశారు. గ్రేటర్ మాస్టర్ ప్లాన్–2041 మ్యాపును విడుదల చేశారు. అనంతరం కళాక్షేత్రం భవనాన్ని రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. కాళోజీ వ్యక్తిగత జీవితంలోని ప్రత్యేక క్షణాలను ప్రతిబింబించే ఫొటోలు, పురస్కారాలు, వ్యక్తిగత వస్తువులు ప్రదర్శించిన ఆర్ట్ గ్యాలరీని సందర్శించారు. ఈసందర్భంగా కాళోజీ ఫౌండేషన్ ప్రతినిధులు వీఆర్ విద్యార్థి, పొట్లపల్లి శ్రీనివాస్‌రావు ముఖ్యమంత్రికి కాళోజీ జీవితం, అక్కడి వస్తువుల గురించి వివరించారు. అనంతరం ఆడిటోరియంలో కాళోజీ జీవిత విశేషాలతో ప్రముఖ సినీ దర్శకుడు డాక్టర్ ప్రభాకర్ జైనీ నిర్మించిన బయోపిక్‌ను వీక్షించారు. ఈసందర్భంగా ప్రముఖ రచయిత అంపశయ్య నవీన్, ట్రస్ట్ సభ్యులు సీఎం రేవంత్‌రెడ్డికి పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సత్కరించారు.
ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి
ప్రజా కవి నిలువెత్తు
కాంస్య విగ్రహం ఆవిష్కరణ
Comments
Please login to add a commentAdd a comment