ఆర్థిక సంస్కరణల పితామహుడు పీవీ
కేయూ క్యాంపస్: ఆర్థిక సంస్కరణల పితామహుడు పీవీ నర్సింహారావు అని కాకతీయ యూనివర్సిటీ వీసీ కె. ప్రతాప్‌రెడ్డి అన్నారు. యూనివర్సిటీలోని పీవీ నాలెడ్జ్‌సెంటర్ డైరెక్టర్ జి. కృష్ణయ్య అధ్యక్షతన సోమవారం మాజీ ప్రధాని పీవీ నర్సింహరావు 20వ వర్ధంతిని క్యాంపస్‌లోని పొలిటికల్ సైన్స్ విభాగ సెమినార్‌హాల్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ క్లిష్ట సమయంలో దేశాన్ని ఆర్థిక గండం నుంచి గట్టెక్కించిన గొప్ప నేత పీవీ నర్సింహారావు అని కొనియాడారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ పి. మల్లారెడ్డి, పాలకమండలి సభ్యులు కె.అనితారెడి, ప్రొఫెసర్ బి. సురేశ్‌లాల్, డాక్టర్ చిర్రరాజు, కేయూ దూరవిద్య కేంద్రం డైరెక్టర్ వి. రాంచంద్రం, కుర్తా అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎ. సదానందం, జనరల్‌సెక్రటరీ ప్రొఫెసర్ వడ్డె రవీందర్, ఆచార్యులు కె. సుధాకర్, పొలిటికల్ సైన్స్ విభాగం అధిపతి సంకినేని వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.
పీవీకి ఘన నివాళి..
హన్మకొండ చౌరస్తా : హనుమకొండలోని డీసీసీ భవన్‌లో సోమవారం మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నేతలు.. పీవీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం హనుమకొండ బస్టాండ్ జంక్షన్‌లోని పీవీ కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వరంగల్ ఎంపీ కావ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, కేఆర్ నాగరాజు, డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, పీసీసీ సభ్యులు బత్తిని శ్రీనివాసరావు, బొద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఈవీ శ్రీనివాసరావు, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు బంక సరళ, కార్పొరేటర్ తోట వెంకటేశ్వర్లు, నాయకులు బంక సంపత్, బొమ్మతి విక్రమ్, బిల్ల రమణారెడ్డి, మహ్మద్ అంకూశ్, కుమార్, సురేందర్, రమేశ్, సతీశ్, హరిసింగ్, తదితరులు పాల్గొన్నారు.
కేయూ వీసీ కె. ప్రతాప్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment