అనారోగ్య సమస్యలు గుర్తించాలి
● వరంగల్ కలెక్టర్ సత్యశారద
వరంగల్: పోషకాహార లోపాన్ని తరిమికొట్టాలంటే కౌమార దశలో ఉన్న బాల బాలికల్లో అనారోగ్య సమస్యలను ముందస్తుగా గుర్తించి అవసరమైన చికిత్స అందించాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా పోషణ అభియాన్ కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ అంగన్‌వాడీలు, సూపర్‌వైజర్లు లబ్ధిదారుల గృహాలను సందర్శించాలన్నారు. జిల్లా పోషణ్ అభియాన్ కోఆర్డినేటర్ కార్తీక్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జిల్లా సంక్షేమ అధికారి రాజమణి, డీఎంహెచ్‌ఓ సాంబశివరావు, డీఈఓ జ్ఞానేశ్వర్, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డాక్టర్ రాజేందర్ పాల్గొన్నారు.
అభివృద్ధి పనులు గడువులో పూర్తి చేయాలి
కాకతీయ మెగా టెక్స్‌టైల్స్ పార్క్, విమానాశ్రయం ఏర్పాటు, ఇన్నర్ రింగ్ రోడ్డు, నేషనల్ హైవే గ్రీన్ ఫీల్డ్ కారిడార్ పనులను నిర్ధేశించిన గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ సత్యశారద అన్నారు. అభివృద్ధి పనుల పురోగతిపై మంగళవారం కలెక్టరేట్ కాన్పరెన్స్‌హాల్‌లో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆమె అధికారులతో మాట్లాడారు. వరంగల్, నర్సంపేట ఆర్డీఓలు సత్యపాల్‌రెడ్డి, ఉమారాణి, టీజీఐఐసీ జోనల్ మేనేజర్ స్వామి, జీఎం ఇండస్ట్రియల్ సల్మాన్‌రాజ్, అడిషనల్ డీఆర్డీఓ రేణుక, తహసీల్దార్లు పాల్గొన్నారు.
ఆన్‌లైన్‌లో సమస్యల సత్వర పరిష్కారం
పెరుగుతున్న అవసరాలు, అందుబాటులోకి వచ్చిన ఆధునిక టెక్నాలజీ ద్వారా ఆన్‌లైన్‌లోనే వినియోగదారుల సమస్యలకు సత్సర పరిష్కారం లభిస్తుందని వరంగల్ అదనపు కలెక్టర్ సంధ్యారాణి అన్నారు. జాతీయ వినియోగదారుల దినోత్సవం పురస్కరించుకొని మంగళవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించిన వినియోగదారుల సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వినియోగదారుల సమస్యల పరిష్కారానికి జిల్లా యంత్రాంగం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తుందని అన్నారు. డీఎస్‌ఓ కిష్టయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈసదస్సులో సివిల్ సప్లయీస్ డీఎం సంధ్యారాణి, డీసీఐసీ అధ్యక్షుడు గిరగాని సుదర్శన్‌గౌడ్, కన్జ్యూమర్ కౌన్సిల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బూరుగుపల్లి శ్రవణ్ కుమార్, డీఈఓ మామిడి జ్ఞానేశ్వర్, క్యాట్కో ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ రతన్ సింగ్ ఠాగూర్, శ్రీనివాస, దామోదర్, నాగేల్లి సారంగం, ప్రభాకర్, సంపత్, లక్ష్మయ్య, వెంకన్న పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment