నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదు
● బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే
వరంగల్ అర్బన్: అభివృద్ధి పనులపై సంబంధిత శాఖల ఇంజనీర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే హెచ్చరించారు. మంగళవారం హనుమకొండ హంటర్ రోడ్డులోని జూ పార్కు, భద్రకాళి బండ్‌ను తనిఖీ చేసి పలు సూచనలు చేశారు. యుద్ధప్రతిపాదికన జూ పార్కులో బాక్స్ డ్రైన్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. వరద నివారణను ఎదుర్కొనేందుకు అడ్వకేట్స్ కాలనీ, నందిహిల్స్ కాలనీ తదితర ప్రాంతాల నుంచి వచ్చే వరద ప్రభావాన్ని నివారించడానికి జూ పార్కులో బాక్స్ డ్రైన్ నిర్మాణం అత్యంత కీలకమన్నారు. అనంతరం భద్రకాళి బండ్ ప్రాంతంలో పర్యటించిన కమిషనర్ చెరువులో శుద్ధిప్రక్రియ చేపట్టడానికి గల అవకాశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment