యూనివర్సిటీ పదవుల్లో బీసీలను నియమించాలి
కేయు క్యాంపస్ : తెలంగాణ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో జనాభా దామాషా ప్రకారం వైస్‌చాన్స్‌లర్‌తో పాటు ఇతర పాలన పదవుల్లో బీసీలను నియమించేలా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ఊరుకోబోమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ హెచ్చరించారు. ఈ మేరకు మంగళవారం కేయూ గెస్ట్‌హౌస్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటి వరకు నియమించిన వైస్ చాన్స్‌లర్ పదవుల్లో కేవలం ముగ్గురు బీసీలకు మాత్రమే అవకాశం కల్పించి తీవ్ర అన్యాయం చేశారని ఆరోపించారు. ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్‌గా బీసీకి అవకాశం కల్పించకపోతే ఆ మండలి ఎదుట నిరసన తెలుపుతామని స్పష్టం చేశారు. ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాల భూములు ఆక్రమణకు గురవుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. విశ్వవిద్యాలయాల భూములను కాపాడే వరకు పోరాటం చేస్తామని తెలిపారు. ఖాళీలను భర్తీ చేసి యూనివర్సిటీలను బలోపేతం చేయాలని, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, మెస్‌బిల్లులను వెంటనే చెల్లించాలన్నారు. విద్యార్థుల త్యాగాలతోనే వచ్చిన రాష్ట్రంలో బడుగు, బలహీన విద్యార్థులకు అన్యాయం చేస్తున్న ప్రభుత్వాన్ని నిలదీయడమే లక్ష్యంగా బీసీ సంక్షేమ సంఘం బాధ్యతతో ముందుకెళ్తోందన్నారు. ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటుతో ప్రభుత్వ యూనివర్సిటీలు నిర్వీర్యమవుతున్నాయన్నారు. ప్రభుత్వ యూనివర్సిటీల్లో టీచింగ్, నాన్‌టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ‘హైడ్రా’ను స్వాగతిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆరేగంటి నాగరాజు, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బైరి రవికృష్ణగౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, దాడిమల్లయ్య యూదవ్, అశోక్ గౌడ్, బోనగాని యాదగిరి గౌడ్, ప్రదీప్‌గౌడ్, రీసెర్చ్ స్కాలర్స్ మహబూబ్‌పాషా, అభిరామ్, నాగరాజు, పృథ్వీ, వేణు, తదితరులు పాల్గొన్నారు.
19వ రోజుకు ఎస్‌ఎస్‌ఏల సమ్మె
విద్యారణ్యపురి: తమకు పేస్కేల్ వర్తింపజేసి, రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ సమగ్ర శిక్ష ఉద్యోగులు (ఎస్‌ఎస్‌ఏ) సమ్మె కొనసాగిస్తున్నారు. హనుమకొండ, వరంగల్ జిల్లాల సమగ్ర శిక్ష ఉద్యోగులు ఏకశిల పార్కు వద్ద చేపట్టిన నిరసన దీక్షలు మంగళవారం 19వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్ష శిబిరాన్ని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ సందర్శించి సంఘీభావం తెలి పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమగ్ర శిక్ష ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలన్నారు. ఈ సమస్యలను పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పరిష్కరించేలా కృషి చేస్తానన్నారు. శిబిరంలో హనుమకొండ, వరంగల్ జిల్లాల సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం అధ్యక్షులు దొనికల శ్రీధర్‌గౌడ్, ఎండీ షఫీ పాల్గొన్నారు.
బీసీ సంక్షేమ సంఘం జాతీయ
అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్
Comments
Please login to add a commentAdd a comment