అవయవదానానికి అంగీకారం
వీహబ్ పోస్టుల భర్తీలో గోల్‌మాల్ వాస్తవమే..
● ముందే చెప్పిన సాక్షి
కాళోజీ సెంటర్ : జిల్లా సంక్షేమ శాఖలో కొత్త మిషన్ శక్తి పథకం కింద డిస్ట్రిక్ట్ హబ్ ఫర్ ఎంపవర్‌మెంట్ ఆఫ్ ఉమెన్‌కు సంబంధించిన కాంట్రాక్ట్ ఉద్యోగ నియామకాల్లో గోల్‌మాల్ జరిగినట్లు రుజువైంది. నాటి డీడబ్ల్యూఓ(జిల్లా సంక్షేమాధికారి) అర్హులకు అన్యాయం చేసి తనకు అనుకూలమైన అభ్యర్థులకు కనీసం సర్టిఫికెట్స్ పరిశీలించకుండా అదే కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగుల కుటుంబ సభ్యులకు అవకాశం ఇచ్చారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇదే విషయంపై కొంత మంది అభ్యర్థులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దత్తత కోరుకునే తల్లిదండ్రులను ఇబ్బందులు పెడుతున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఈ నియామకాలపై విచారణ చేపట్టిన ఆర్జేడీ ఎటూతేల్చలేదు. దీంతో పోలీస్ ఇంటలిజెన్స్ అధికారులు విచారణ చేపట్టి ఇటీవలనే నివేదిక అందజేశారు. ఈ విషయంపై మంగళవారం డీడబ్యుఓ రాజమణిని వివరణ కోరగా.. స్పెషలిస్టు ఇన్ ఫైనాన్స్ లిటరిసీ విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగి సుజాతది నకిలీ పీజీ సర్టిఫికెట్ అని రిపోర్టు వచ్చిందన్నారు. అయితే సుజాత రిపోర్టు గురించి ముందే గ్రహించిన సుజాత తన ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్లడం కొసమెరుపు. దీంతోపాటు గతంలో దత్తత విషయంలో నిబంధనలు పాటించని అధికారిపై విచారణ జరిగిందని నివేదికలు ఉన్నతాధికారులకు పంపించామని, వారి ఆదేశాల మేరకు తదుపరి చర్యలు ఉంటాయని అన్నారు.
నిరుద్యోగులకు ఉచిత శిక్షణ
న్యూశాయంపేట: మైనార్టీ (ముస్లిం, క్రిస్టియన్, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్శీ ) నిరుద్యోగ యువతకు వివిధ కోర్సుల్లో మూడునెలల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు వరంగల్, హనుమకొండ జిల్లాల మైనార్టీ సంక్షేమ అధికారులు టి.రమేశ్, డి.మురళీధర్‌రెడ్డి వేర్వేరు ప్రకటనలో మంగళవారం తెలిపారు. ఇంటర్, ఆపై చదువుకున్న అర్హులైన యువతకు జూనియర్ సా ఫ్ట్‌వేర్ డెవలపర్, డిజిటల్ మార్కెటింగ్ మే నేజర్ కోర్సుల్లో శిక్షణ ఇస్తామన్నారు. దరఖా స్తులను ఈనెల 31లోగా ఆయా కార్యాలయాల్లో అందజేయాలన్నారు. వివరాల కు హనుమకొండ జిల్లా వారు సుబేదారి కలక్టరేట్ కాంప్లెక్స్‌లో 2వ అంతస్తు, వరంగల్ జిల్లా వారు సుబేదారి అపోలో ఫార్మసీ పక్కన 2వ అంతస్తులో ఉన్న కార్యాలయాల్లో సంప్రదించాలని సూచించారు.
హసన్‌పర్తి: మరణానంతరం తమ పార్థివదేహాలను కాకతీయ మెడికల్ కళాశాలకు అప్పగించేందుకు దంపతులు ముందుకు వచ్చారు. హనుమకొండ మండలం గోపాలపురం వినాయక నగర్‌కాలనీకి చెందిన సూరం మహేందర్ ఆర్టీసీలో ఉద్యోగి, ఆయన భార్య పద్మజా గృహిణి. కాగా మరణానంతరం తమ దేహాలను వైద్య విద్య విద్యార్థులకు ఇవ్వడానికి నిర్ణయించారు. తెలంగాణ నేత్ర, అవయవ, శరీర దాతల అసోసియేషన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు మల్లారెడ్డి, ఉపాధ్యక్షుడు ఉపేందర్‌రెడ్డి, భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు కామిడి సతీశ్‌కు సమాచారం అందించారు. ఈమేరకు మంగళవారం వారు ఆ దంపతుల ఇంటికి వెళ్లి వారితో మాట్లాడి వారినుంచి అంగీకార పత్రం తీసుకున్నారు. ఈ పత్రాన్ని కాకతీయ మెడికల్ కళాశాలకు అందిస్తామన్నారు. మునిగాల పద్మపుల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment