కాళేశ్వరం: వచ్చే ఏడాది మే 15 నుంచి సరస్వతి నది పుష్కరాల నిర్వహణ, భక్తులకు కల్పించాల్సి న సౌకర్యాలపై సంబంధితశాఖ మంత్రి కొండా సురేఖతో కలిసి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. మంగళవారం ఆయన జయశంకర్‌భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కేంద్రంలో జాతీయ రహదారి 353(సీ)పైన కాళేశ్వరం దేవస్థానం ఆర్చిగేటు పునఃనిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈసందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో శివరాత్రికి, మే నెలలో జరగనున్న సరస్వతి నది పుష్కరాలకు భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించనున్నామన్నారు. జిల్లా మీదుగా కాళేశ్వరం.. సిరొంచ వరకు నాలుగు వరుసల రహదారికి అనుగుణంగా వెడల్పుతోపాటు అధునాతన డిజైన్‌తో ఆర్చి నిర్మాణం చేయాలన్నారు. నాలుగు వరుసల రహదారి కోసం ప్రతిపాదనలు చేస్తున్నామని పేర్కొన్నారు.పుష్కరాలకు వివిధ రాష్ట్రాల నుంచి భక్తజనం తరలి రానున్నందున, వారికి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు అందజేస్తామన్నారు.
వచ్చే ఏడాది మే 15 నుంచి పుష్కరాలు
రాష్ట్ర ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
Comments
Please login to add a commentAdd a comment