సీఎం కప్ క్రీడలకు ఏర్పాట్లు చేయాలి
● కలెక్టర్ ప్రావీణ్య
హన్మకొండ అర్బన్: సీఎం కప్ క్రీడాపోటీ ల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో జీడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డితో కలిసి క్రీడల నిర్వహణపై ఆయా శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈనెల 27నుంచి జనవరి 2వ తేదీ వరకు నగరంలోని జేఎన్‌ఎస్‌లో సీఎం కప్ రాష్ట్ర స్థాయి క్రీడలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే క్రీడాకారులకు వసతి, భోజనం, రవాణా,తదితర సౌకర్యాలు కల్పించాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో డీవైఎస్‌ఓ అశోక్, డీఎంహెచ్‌ఓ అప్పయ్య, అధికారులు పాల్గొన్నారు.
ఉత్సావాలు ఉద్యోగుల్లో ఐక్యతను పెంపొందిస్తాయి
ఉత్సవాలు ఉద్యోగుల్లో ఐక్యతను పెంపొందిస్తాయని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. మంగళవారం జిల్లా టీఎన్జీఓస్ యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో కలెక్టర్ ప్రావీణ్య పాల్గొని కేక్ కట్ చేసి, జిల్లా ప్రజలు, ఉద్యోగులు, అధికారులకు శుభాకాంక్షలు తెలిపారు. అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి, డీఆర్‌ఓ గణేష్, డీఆర్డీఓ పీడీ మేన శ్రీను, డీఎంహెచ్‌ఓ అప్పయ్య, ట్రెజరీ అధికారులు శ్రీనివాస్‌రెడ్డి, అన్వర్, టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆకుల రాజేందర్, బైరి సోమయ్య, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment