ఆర్టీసీ బస్సుకు తప్పిన పెనుప్రమాదం
యాదగిరిగుట్ట రూరల్: హైదరాబాద్–వరంగల్ జాతీయ రహదారిపై యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామం వద్ద నిర్మాణంలో ఉన్న అండర్‌పాస్ బ్రిడ్జి పైకి ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు దూసుకెళ్లి ఆగిపోయింది. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్–2 డిపోనకు చెందిన ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు సోమవా రం ఉదయం హైదరాబాద్ నుంచి హనుమకొండకు 33 మంది ప్రయాణికులతో బయలుదేరింది. మార్గమధ్యలో యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామం వద్దకు రాగానే అండర్‌పాస్ బ్రిడ్జి పైకి అదుపుతప్పి దూసుకెళ్లింది. ఇనుప చువ్వలను తాకి నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు ఒకరిమీద ఒకరు పడడంతో స్వల్ప గాయాలయ్యాయి. దీంతో 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు. ఈ ప్ర మాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. జాతీయ రహదా రిపై సరైన ఇండికేషన్ లేకపోవడంతోనే ప్రమా దం జరిగిందని ప్రయాణికులు ఆరోపించారు.
నిర్మాణంలో ఉన్న అండర్‌పాస్ బ్రిడ్జికి ఢీ..
పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలు
యాదగిరిగుట్ట మండలం వంగపల్లి వద్ద ఘటన
Comments
Please login to add a commentAdd a comment