నూతన ఔషధాలపై పరిశోధించాలి
కేయూ క్యాంపస్ : నూతన ఔషధాలను కనుగొనేలా పరిశోధనలు చేయాలని కాకతీయ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ కె.ప్రతాప్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం కేయూ ఫార్మసీ కళాశాల ఆధ్వర్యంలో సెనేట్‌హాల్‌లో నిర్వహించిన డ్రగ్ డిస్కవరీ ఇన్నోవేషన్స్ అండ్ డెవలప్‌మెంట్ (డీడీఐడీ–2025) అంశంపై నిర్వహించిన ఒక రోజు అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు.అనంతరం పోస్టర్లు ఆవిష్కరించారు. రూసా నుంచి రూ.12కోట్లతో పరిశోధన కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కాన్ఫరెన్స్‌లో విద్యార్థులు విషయ నిపుణుల నుంచి విజ్ఞానాన్ని గ్రహించాలని సూచించారు. ఫార్మసీలోని పరిశోధన ఫలితాలను ఐపీఆర్ ద్వారా నమోదు చేయాలన్నారు. పరిశోధనల పరంగా నూతన ఆవిష్కరణలో నిబద్ధత ఉండాల్సిన అవసరం ఉందన్నారు. నాణ్యమైన పరిశోధనలకు ఫార్మసీలో పరిశోధనలకు ప్రోత్సహిస్తామని తెలిపారు. కేయూ రిజిస్ట్రార్ పి.మల్లారెడ్డి మాట్లాడుతూ ఫార్మసీలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌తో పరిశోధనల పరంగా రూసా మంజూరు చేసిన ప్రాజెక్టులకు మంచి ఉపయోగమన్నారు. 30వ తేదీన కూడా ఫార్మసీలో జరిగే కాన్ఫరెన్స్ విద్యార్థులకు, అధ్యాపకులకు ఎంతో ఉపయోగపడుతుంన్నారు. ఈ కాన్ఫరెన్స్‌లో కేయూ ఫార్మసీ డీన్ ప్రొఫెసర్ గాదె సమ్మయ్య, ప్రవాస భారతీయుడు డాక్టర్ సాంబరెడ్డి, న్యూడ్రగ్ డిస్కవరీ అండ్ డెవలప్‌మెంట్‌పై కీలకపోన్యాసం చేశారు. న్యూజెర్సీ సైంటిస్టు డాక్టర్ కార్తీక్ యాదవ్‌జంగా, సీసీఎంబీ సైంటిస్టు ఎన్.దినేష్ , కేయూ ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ ఎన్.ప్రసాద్, యూజీసీ కోఆర్డినేటర్ ఆర్.మల్లికార్జున్‌రెడ్డి, హైదరాబాద్, వరంగల్ డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు శివదేవ్, జన్ను కిరణ్, వై.నర్సింహారెడ్డి మాట్లాడారు. పలువురు విషయ నిపుణులు ఫార్మసీ రంగంలో పరిశోధనల గురించి వివరించారు.
రూ.12 కోట్లతో పరిశోధన
కేంద్రాల ఏర్పాటు
కేయూ వీసీ ప్రతాప్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment