పాకాల రూపురేఖలు మారుస్తాం
ఖానాపురం : పర్యాటక రంగ అభివృద్ధిలో పాకాల రూపురేఖలు మారుస్తామని సీసీఎఫ్ భీమానాయక్ అన్నారు. ఈ మేరకు మండలంలోని పాకాలలో అటవీ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనులను మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల్లో నాణ్యత, పని విధానాలు పరిశీలించారు. పాకాలలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై అధికారులతో చర్చించారు. నూతనంగా ఏర్పాటు చేసిన బోటింగ్ చేసి పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పాకాలలో పర్యాటకులను ఆకర్షించేలా అభివృద్ధి పనులు చేయనున్నట్లు తెలిపారు. పార్కింగ్ టికెట్ కౌంటర్, బ్యాటరీ వాహనాలు, క్యాంటీన్లు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. హైదరాబాద్‌తో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకుల కోసం వాకింగ్ ట్రాక్, సైక్లింగ్, సఫారీ వాహనాలు, నైట్ క్యాంపింగ్ సైట్‌ను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. దశల వారీగా పనులు చేపడుతూ పాకాలను పర్యాటక రంగ అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తామన్నారు. పర్యాటకులు స ఫారీ ద్వారా ముసలమ్మ దేవాలయం, భీముని పా దం, పులిమడుగు క్యాంపింగ్ సైట్, చిలుకలగుట్ట అందాలను వీక్షించేలా చర్యలు చేపడుతున్నామన్నారు. అవసరం మేరకు పనులు చేపడతామన్నా రు. పాకాల అందాలు వీక్షించిన పర్యాటకులు మ రోసారి వచ్చేలా అభివృద్ధి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో వరంగల్, మహబూబాబాద్ డీఎఫ్‌ఓలు అనూజ్ అగర్వాల్, విశాల్, ఎఫ్‌డీఓ చంద్రశేఖర్, ఎఫ్‌ఆర్వో రవికిరణ్, వజహత్, డీఆర్వో రీనా, సెక్షన్, బీట్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
సీసీఎఫ్ భీమానాయక్
పాకాలలో అభివృద్ధి పనుల పరిశీలన
Comments
Please login to add a commentAdd a comment