‘ఎస్సార్’లో న్యూజిలాండ్ యూనిఫెస్ట్–25
హసన్‌పర్తి: హసన్‌పర్తి మండలం అన్నాసాగరంలో ని ఎస్సార్ యూనివర్సిటీలో మంగళవారం న్యూజి లాండ్ యూనిఫెస్ట్–25 ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా న్యూజిలాండ్‌లోని ఎనిమిది పబ్లిక్ యూనివర్సిటీల ప్రతినిధులు ఒకే వేదికపై సమావేశమైనట్లు ఎస్సార్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ దీపక్ గార్గ్ తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈకార్యక్రమం ద్వారా విద్యార్థులను గ్లోబల్ ఎక్స్‌పోజర్‌తో సంపన్నంగా తీర్చిదిద్దొచ్చన్నారు. యూనివర్సిటీ బీఎస్సీ (అగ్రికల్చర్) విద్యార్థులు మొదటి రెండేళ్ల కాలంలో క్యాంపస్‌లో విద్యను పూర్తి చేసిన అనంతరం మరో రెండేళ్లు న్యూజిలాండ్‌లోని బటాగో యూనివర్సిటీలో ఫుడ్‌సైన్స్ బీఎస్సీ చదివి పట్టా పొందుతారన్నారు. అనంతరం అంతర్జాతీయ వ్యవహారాల, కార్పొరేట్ ఔట్‌రీచ్ డైరెక్టర్ ప్రిథా చక్రవర్తి మాట్లాడారు. విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయిలో వారి సామర్థ్యాలను విస్తరించడానికి ఈ కార్యక్రమం ప్రేరణాత్మక ముందడుగు అన్నారు. విద్యార్థులకు అంతర్జాతీయ విద్య గురించి నిర్ణయాలు తీసుకునేలా అవగాహన కల్పిస్తామన్నారు. విద్య కోర్సులు, స్కాలర్‌షిప్‌లు, అంతర్జాతీయ విద్యార్థి జీవితంలోని ప్రాథమిక విషయాలపై జరిగిన చర్చలు విద్యార్థుల అకడమిక్ ప్రయాణాన్ని సులభతరం చేస్తాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment