బీసీలు ఏకమైతేనే రాజ్యాధికారం
హన్మకొండ చౌరస్తా : బీసీలంతా ఏకమైతేనే రాజ్యాధికారం సాధ్యమని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పేర్కొన్నారు. మంగళవారం బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం ఉమ్మడి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 24వ తేదీన (శుక్రవారం) హరితహోటల్‌లో ‘స్థానిక సంస్థల ఎన్నికలు–బీసీల పాత్ర–రిజర్వేషన్లు’ అనే అంశంపై నిర్వహించే సదస్సుపై హనుమకొండలోని అ శోకా కాన్ఫరెన్స్ హాల్‌లో చర్చించారు. డాక్టర్ కూరపాటి రమేశ్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి తీన్మార్ మల్లన్న ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బీసీలకు దక్కాల్సిన ఫలాలను అగ్రకులాలు హస్తగతం చేసుకున్నాయని వెల్లడించారు. ఇప్పటికై నా బీసీ లంతా ఏకమై వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వు చేసిన సీట్లను మినహాయించి మిగతా వాటిలో పూర్తిగా బీసీ నాయకులే పోటీ చేసి గెలవాలని ఉద్ఘాటించారు. ఈ సమావేశంలో ఫోరం కోఆర్డినేటర్ డాక్టర్ కె.వీరస్వామి, నాయకులు డాక్టర్ సీహెచ్ రాములు, దారం జనార్దన్, సుందర్‌రాజ్ యాదవ్, డాక్టర్ ఎల్.చంద్రమోహన్, కె.వెంకటస్వామి, తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
Comments
Please login to add a commentAdd a comment