కాజీపేట జంక్షన్‌లో గంజాయి
కాజీపేట రూరల్: కాజీపేట జంక్షన్‌లో మంగళవారం గంజాయి బ్యాగు కలకలం సృష్టించింది. ఆగంతకులు రహస్య ప్రదేశంలో దాచిపెట్టిన గంజాయి బ్యాగు పోలీస్ జాగిలానికి చిక్కింది. కాజీపేట పోలీసుల అధికారుల కథనం ప్రకారం.. కాజీపేట రైల్వేస్టేషన్ నుంచి పెద్ద మొత్తంలో గంజాయిని తరలిస్తున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనరేట్ యాంటీ డ్రగ్స్ కంట్రోల్ టీంకు ఉదయం సమాచారం అందింది. వెంటనే యాంటీ డ్రగ్స్ కంట్రోల్ టీం పోలీసులు పోలీసు జాగీలాలతో కాజీపేట రైల్వే స్టేషన్‌కు చేరుకుని ప్రయాణికులతోపాటు అనుమానా స్పద వస్తువులను తనిఖీలు చేశారు. ఒకటో నంబర్ ప్లాట్‌ఫాం చివర వరంగల్ వైపు రూట్‌లో ప్రయాణికులు కూర్చునే బల్ల కింద రహస్యంగా భద్రపరచిన బ్యాగును జాగిలం గుర్తించి అరిచింది. దీంతో పోలీసులు అప్రమత్తమై బ్యాగును స్వాధీనం చేసుకుని తెరచి చూశారు. అందులో నాలుగు కిలోల గంజాయిని గుర్తించి స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. తనిఖీల్లో ఇన్‌స్పెక్టర్ సురేశ్, ఆర్‌ఐ శివకేశవులు, ఆర్‌ఎస్సైలు పూర్ణమనోజ్, నాగరాజు, సిబ్బంది పాల్గొన్నారు.
ప్లాట్‌ఫాం–1లో బ్యాగును గుర్తించిన
పోలీస్ జాగిలం
స్వాధీనం చేసుకున్న యాంటీ డ్రగ్స్ కంట్రోల్ టీం
Comments
Please login to add a commentAdd a comment