హన్మకొండ చౌరస్తా: హనుమకొండ కేడీసీ ఎదురుగా ఉన్న ప్రభుత్వ వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రంలో వివిధ కోర్సుల్లో శిక్షణ పొందిన అభ్యర్థులకు శనివారం పరీక్షలు నిర్వహించారు. ఎంఎస్ ఆఫీస్, బ్యూటీషియన్, సీసీటీవీ ఇన్‌స్టాలేషన్, ఫ్యాషన్ డిజైనింగ్, గార్మెంట్ మేకింగ్, రిఫ్రిజిరేషన్, ఏసీ, డొమెస్టిక్ ఎలక్ట్రీషియన్ కోర్సుల్లో 108 మంది శిక్షణ తీసుకున్నారు. అందులో 94 మంది పరీక్షలకు హాజరైన ట్లు హనుమకొండ డీవైఎస్‌ఓ గుగులోత్ అశోక్‌కుమార్ తెలిపారు. పరీక్షల నిర్వహణను సెట్విన్ అధికారి ఆసీం పర్యవేక్షించారు. సూపరింటెండెంట్ వై.విజయశ్రీ, సిబ్బంది శ్రీనివాస్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment