![అభివృద్ధి కోసమే కాంగ్రెస్‌లో చేరా..](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/09hmkd127-330087_mr-1739130611-0.jpg.webp?itok=9jbjRUPo)
అభివృద్ధి కోసమే కాంగ్రెస్‌లో చేరా..
హన్మకొండ చౌరస్తా: నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికే కాంగ్రెస్ పార్టీలో చేరానని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. హనుమకొండలోని తన నివాసంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఈ 11 నెలల వ్యవధిలో సీఎం రేవంత్‌రెడ్డి సహకారంతో నియోజకవర్గ అభివృద్ధికి సుమారు రూ.వెయ్యి కోట్ల నిధులు మంజూ రు చేయించానని అన్నారు. రైతులకు సాగు నీటికోసం దేవాదుల ఎత్తిపోతల పథకం, స్టేషన్‌ఘన్‌పూర్‌లో వంద పడకల ఆస్పత్రి, డిగ్రీ కళాశాల, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటుకు నిధులు మంజూయ్యాయని చెప్పారు. ఎకోటూరిజం కోసం 4వేల ఎకరాల్లోని దేవునూరు గుట్టల్లో ఆక్సిజన్ పార్క్, ట్రెక్కింగ్, ధర్మసాగర్ నుంచి దేవునూర్ గుట్టల వరకు బ్రిడ్జి నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేయనున్నట్లు తెలిపారు. అభివృద్ధి పనులకు నిధులు మంజూ రైనా ఎన్నికల కోడ్ కారణంగా శంకుస్థాపన చేయలేదని, కోడ్ ముగియగానే సీఎం చేతుల మీదుగా అభివృద్ధి పనులు ప్రారంభిస్తామని చెప్పా రు. ఇన్ని నిధులు తీసుకొచ్చినా కాంగ్రెస్ పార్టీ.. శ్రీహరి అంటే గిట్టనివారు గతంలోనే మంజూరయ్యాయంటూ చేతగాని విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. సుప్రీం కోర్టు తీర్పు మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణ ఆధారంగా రిజర్వేషన్లు అమలు చేయాల్సిందేనన్నారు. అయితే ప్రస్తుత జనాభా ప్రకారం ఎస్సీలను ఏబీసీడీలుగా వర్గీ కరించి 18శాతం రిజర్వేషన్లు అమలయ్యేలా జీఓ విడుదల చేయాలని ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి
Comments
Please login to add a commentAdd a comment