![బీఆర్](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/10022025-wud_tab-07_subgroupimage_1878527040_mr-1739130609-0.jpg.webp?itok=UOaS5cgH)
బీఆర్‌ఎస్ బీసీ మీటింగ్‌లో జిల్లా నేతలు
హన్మకొండ: హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో ఆదివారం బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన జరిగిన ఆ పార్టీ బీసీ నాయకుల సమావేశంలో హనుమకొండ జిల్లా నాయకులు పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్, కార్పొరేటర్లు బి.అశోక్‌యాదవ్, చెన్నం మధు, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కోఆర్డినేటర్ పులి రజినీకాంత్, మాజీ కార్పొరేటర్లు కుసుమ లక్ష్మీనారాయణ, ఉడుతల సారంగపాణి, సీనియర్ నాయకులు సుంచు కృష్ణ, నార్లగిరి రమేష్, విద్యార్థి విభాగం నాయకులు వీరస్వామి పాల్గొన్నారు.
నేటి కలెక్టరేట్ గ్రీవెన్స్ రద్దు
వరంగల్: కలెక్టరేట్‌లో నేడు (సోమవారం) నిర్వహించే గ్రీవెన్స్‌ను రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఒక ప్రకటనలో తెలిపారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక, పరిపాలన కారణాల దృష్ట్యా గ్రీవెన్స్ రద్దు చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ప్రజలు గమనించి ఫిర్యాదులు ఇచ్చేందుకు కలెక్టరేట్‌కు రావొద్దని కలెక్టర్ కోరారు.
నేడు గ్రేటర్ గ్రీవెన్స్
వరంగల్: వరంగల్ మహానగర పాలకసంస్థలో సోమవారం ఉదయం 11 గంటలకు గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు బల్దియా కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు. గ్రేటర్ వరంగల్ పరిధిలోని ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం వినతి పత్రాలను అందజేయాలని సూచించారు.
హెలికాప్టర్ ద్వారా
గ్రామాల సర్వే
● రెండు రోజుల పాటు నిర్వహణ
కాజీపేట రూరల్: వరంగల్ జిల్లాలో రెండు రోజుల పాటు గ్రామాలు, పట్టణాలు, సిటీని సర్వే చేయడానికి హెలికాప్టర్ బృందం ఆదివా రం కాజీపేట ఫాతిమానగర్‌లోని సేయింట్ గ్యాబ్రియల్ స్కూల్ గ్రౌండ్‌కు చేరుకుంది. ఈ సర్వేను కేంద్ర ప్రభుత్వం ఆర్‌వీ సంస్థకు అప్పగించింది. ఆదివారం ఉమ్మడి జిల్లాలో హుస్నాబాద్, వర్ధన్నపేట ప్రాంతాల్లో హెలికాప్టర్‌కు అమర్చిన యంత్రంతో సర్వే చేసినట్లు తెలిసింది. రాత్రి సేయింట్ గ్యాబ్రియల్ స్కూల్ గ్రౌండ్‌లో హెలికాప్టర్ నిలిచింది. సోమవారం ఉమ్మడి వరంగల్‌లోని పలు ప్రాంతాల్లో సర్వే చేయనున్నట్లు సమాచారం.
సేవాలాల్ జయంతి
ఉత్సవాలు ప్రారంభం
గీసుకొండ: లంబాడీల ఆరాధ్య దైవం సద్గురు సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి ఈనెల 15న ఉండగా.. ముందస్తుగా సన్నాహక ఉత్సవాలను రేవంత్ క్రియేటివ్ కాన్సెప్ట్ (ఆర్‌సీసీ) వ్యవస్థాపకుడు రేవంత్ రాథోడ్ ఆధ్వర్యంలో ఆదివారం ప్రారంభించారు. మహిళలు సంప్రదాయ దుస్తులు, పురుషులు తలపాగాలతో తరలివచ్చారు. మచ్చాపూర్ నుంచి కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి ఆలయం వరకు పలు తండాలను కలుపుతూ బైక్ ర్యాలీ నిర్వహించా రు. ర్యాలీలో దారి పొడవునా సేవాలాల్ చిత్రపటానికి డ్రోన్ ద్వారా పూలవర్షం కురిపించారు. మహిళలు తలపై బిందెలను పెట్టుకుని చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. కొమ్మాల ఆల యం వద్దకు చేరుకుని భోగ్ బండార్ (దేవుడికి నైవేద్యం) కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం అన్నదానం చేశారు. ఉత్సవాల్లో సీఐ బానోత్ కాశీరాం, కాంగ్రెస్ నాయకులు వీరగోని రాజ్‌కుమార్, రడం భరత్, మర్రెడ్డి, లంబాడీ పెద్దలు అజ్మీరా రాజు, వాగ్య, కిషన్ మహరాజ్, ఉత్సవ కమిటీ చైర్మన్ బానోత్ రాఘవేంద్ర, రాజశేఖర్, రాజేశ్, వీరన్న, భిక్షప తి, కేలోత్ స్వామి, మోతీలాల్, మోహన్, హరి, రాజు, వెంకన్న, సాయిప్రకాశ్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
![బీఆర్‌ఎస్ బీసీ మీటింగ్‌లో జిల్లా నేతలు1](https://www.sakshi.com/gallery_images/2025/02/10/09prkl204-330074_mr-1739130609-1.jpg)
బీఆర్‌ఎస్ బీసీ మీటింగ్‌లో జిల్లా నేతలు
![బీఆర్‌ఎస్ బీసీ మీటింగ్‌లో జిల్లా నేతలు2](https://www.sakshi.com/gallery_images/2025/02/10/09hmkd55-330086_mr-1739130610-2.jpg)
బీఆర్‌ఎస్ బీసీ మీటింగ్‌లో జిల్లా నేతలు
Comments
Please login to add a commentAdd a comment