సాక్షిప్రతినిధి, వరంగల్: రవాణాశాఖ వరంగల్ డి ప్యూటీ ట్రాన్స్‌ఫోర్ట్ కమిషనర్‌గా పని చేసిన పుప్పా ల శ్రీనివాస్‌పై సస్పెన్షన్ వేటు పడినట్లు తెలిసింది. ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారంలో అవినీ తి నిరోధకశాఖ అధికారులు శ్రీనివాస్‌తో పాటు అయన బంధువులు, కుటుంబసభ్యుల ఇళ్లలో ఈనెల 7వ తేదీన సోదాలు నిర్వహించిన సంగతి తెలిసింది. ఈ మేరకు రూ.4.04 కోట్ల విలువైన అక్రమాస్తులను ప్రాథమికంగా గుర్తించిన ఏసీబీ.. ఆయనపై అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 13(1)(బి), 13(2)తో పాటు తెలంగాణ ఎకై ్సజ్ చట్టం–1968 కింద కేసులు నమోదు చేసి వరంగల్‌లోని ఏసీబీ కోర్టులో హాజరు పర్చింది. ఈ మేరకు కోర్టు ఆయనకు 14 రోజులు రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలో పుప్పాల శ్రీనివాస్‌ను రవాణాశాఖ కమిషనర్ సస్పెండ్ చేసినట్లు అధికారవర్గాల సమాచారం. కాగా ఉమ్మడి వరంగల్‌కు నోడల్ అధికారిగా ఉన్న హనుమకొండ డిప్యూటీ ట్రాన్స్‌ఫోర్ట్ కమిషనర్ పుప్పాల శ్రీనివాస్ స్థానంలో సీనియర్ డీటీసీని నియమించేందుకు కమిషనర్‌కు ప్రతిపాదనలు పంపినట్లు తెలిసింది. త్వరలోనే ఉత్తర్వులు వెలువడనుండగా.. అంతకంటే ముందు సీనియర్ ఎంవీఐకి జిల్లా రవాణా శాఖ అధికారి(డీటీఓ)గా ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని విశ్వసనీ య సమాచారం. ప్రస్తుతం రవాణా శాఖ హనుమకొండ జిల్లా కార్యాలయంలో పని చేస్తున్న సీనియర్ మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ రమేశ్ రాథోడ్‌కు.. లేదంటే మరో ఎంవీఐ వేణుగోపాల్ రెడ్డికి ఇన్‌చార్జ్ డీటీఓ బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయి. రెండు రోజుల్లో ఈ ఉత్తర్వులు వెలువడ నున్నాయని రవాణాశాఖ ఉన్నతాధికారవర్గాల ద్వారా తెలిసింది.
అక్రమాస్తుల కేసులో రిమాండ్
త్వరలోనే డిప్యూటీ ట్రాన్స్‌ఫోర్ట్
కమిషనర్ నియామకం
మొదట సీనియర్ ఎంవీఐకి
నేడు డీటీఓ బాధ్యతలు
Comments
Please login to add a commentAdd a comment