ఖిల్లా.. పట్టింపు డొల్ల | - | Sakshi
Sakshi News home page

ఖిల్లా.. పట్టింపు డొల్ల

Published Mon, Feb 10 2025 1:21 AM | Last Updated on Mon, Feb 10 2025 1:21 AM

ఖిల్ల

ఖిల్లా.. పట్టింపు డొల్ల

రుగల్లును రాజధానిగా చేసుకుని కాకతీయులు 300 సంవత్సరాలు ఏకదాటిగా ఏలిన రాజ్యం.. నేడు అధికారుల నిర్లక్ష్యంతో నిర్మాణాలు కాలగర్భంలో కలిసిపోయే పరిస్థితి నెలకొంది. కేంద్ర పురావస్తుశాఖ అధికారుల పర్యవేక్షణ లోపంతో ఆకతాయిల వల్ల నిర్మాణాలు, శిల్పాలు ధ్వంసమవుతున్నాయి.

ప్రతి ఏటా నిర్వహించే వారసత్వ వారోత్పవాల్లో కేంద్ర పురావస్తుశాఖ అధికారుల సందడి కనిపించినా.. ఆ తర్వాత అధికారులు, సిబ్బంది పట్టించుకున్న దాఖలాలు లేవనే ఆరోపణలు ఉన్నాయి.

కనుమరుగవుతున్న ఆహ్లాదం..

రాతి, మట్టి కోటలపై దట్టమైన ముళ్ల పొదలు పెరిగి పర్యాటకులు దర్శించలేని పరిస్థితి నెలకొంది. అత్యంత పటిష్టంగా నల్లరాతితో నిర్మించిన రాతికోట మెట్ల మార్గంపై భారీ వృక్షాలు విస్తరించి కోటను పెకిలించి వేస్తున్నాయి. ఏపుగా పెరిగిన ముళ్ల పొదల మూటున అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. కేంద్ర పురావస్తుశాఖ సిబ్బంది శిల్పాల ప్రాంగాణానికే పరిమితమవుతున్నారే తప్ప ముళ్ల పొదలు, వృక్షాలు తొలిగింపు చేపట్టడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

శిథిలమవుతున్న రాతి, మట్టికోటలు

కూలుతున్న కట్టడాలు, శిల్పాలు

కోట గోడలపై విస్తరించిన చెట్లు

కనుమరుగవుతున్న ఆహ్లాదం

పట్టించుకోని కేంద్ర

పురావస్తుశాఖ అధికారులు

కాకతీయుల కాలం నాటి కట్టడాలు.. నిర్మాణాలు.. చారిత్రక శిల్ప కళాసంపదను భావితరాల కోసం కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నా.. పాలకులు పట్టించుకోవడంలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రపంచ వారసత్వ నగరంగా గుర్తింపు వచ్చిన ఓరుగల్లు పర్యాటక ప్రదేశంలో చెప్పకోదగిన అభివృద్ధి జరగలేదనే విమర్శలున్నాయి. తెలుగు రాష్ట్రాలను ఏకం చేసి పరిపాలించిన కాకతీయ చక్రవర్తులు నేటి తరానికి మిగిల్చిన ఆనవాళ్లను కాపాడుకోలేని దుస్థితి కన్పిస్తున్నది. – ఖిలా వరంగల్‌

మంత్రి సురేఖపైనే కోటి ఆశలు..

వరంగల్‌ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే కొండా సురేఖ రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి కావడంతో కోట అభివృద్ధిపై అంద రూ ఆమె వైపే చూస్తున్నారు. ప్రపంచ పర్యాటకులను ఆకర్శించేలా కోటను అభివృద్ధి చేస్తామని మంత్రి పలు మార్లు హామీ ఇవ్వటంతో ఆశలు చిగురిస్తున్నాయి. దశాబ్దాల కాలంగా ఆభివృద్ధికి దూరమైన చారిత్రక కోట మంత్రి చొరవతోనైనా మెరుగు పడుతుందని ఆశిస్తున్నారు. పురాతనమైన ఆలయాల్లో దేవతామూర్తుల విగ్రహాలను ప్రతిష్ఠించి ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దాలని స్థానికులు కోరుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
ఖిల్లా.. పట్టింపు డొల్ల1
1/4

ఖిల్లా.. పట్టింపు డొల్ల

ఖిల్లా.. పట్టింపు డొల్ల2
2/4

ఖిల్లా.. పట్టింపు డొల్ల

ఖిల్లా.. పట్టింపు డొల్ల3
3/4

ఖిల్లా.. పట్టింపు డొల్ల

ఖిల్లా.. పట్టింపు డొల్ల4
4/4

ఖిల్లా.. పట్టింపు డొల్ల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement