ఉప్పల్‌ కాంగ్రెస్‌లో వర్గపోరు | - | Sakshi
Sakshi News home page

ఉప్పల్‌ కాంగ్రెస్‌లో వర్గపోరు

Published Sun, Jul 30 2023 7:28 AM | Last Updated on Sun, Jul 30 2023 9:34 AM

- - Sakshi

హైదరాబాద్: ఉప్పల్‌ కాంగ్రెస్‌లో వర్గపోరు తారస్థాయికి చేరింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి శనివారం పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి, మందుముల పరమేశ్వర్‌రెడ్డి వర్గీయులు పోటాపోటీగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఉదయం ఏర్పాటు చేసిన రాగిడి లక్ష్మారెడ్డి ఫ్లెక్సీలను కొందరు వ్యక్తులు పూర్తిగా చించివేయడంతో వాటిని మరోసారి ఏర్పాటు చేశారు.

రేవంత్‌రెడ్డి వచ్చే సమయానికి ఉప్పల్‌ వీటీ కమాన్‌ వద్ద ఉన్న ఫ్లెక్సీలను కొంతమంది ఆ పార్టీ కార్యకర్తలు పోలీసుల చూస్తుండగానే చించివేశారు. దీంతో అక్కడే ఉన్న ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట తారస్థాయికి చేరి గొడవకు దారి తీసింది. ఈలోపు పోలీసులు రంగ ప్రవేశం చేసి చెదరగొట్టారు. తోపులాటలో పోలీసులతో పాటు కొంతమందికి గాయాలయ్యాయి.

పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి రాక సందర్భంగా ఏర్పాటు చేసిన స్వాగత ఫ్లెక్సీలను కొందరు వ్యక్తులు చించి వేసి తమ కార్యకర్తలు, నాయకులపై దాడి చేశారని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాగిడి లక్ష్మారెడ్డి, . ఘర్షణలో గాయపడిన ఉప్పల్‌ అసెంబ్లీ ఎస్సీసెల్‌ చైర్మన్‌ కె.నరేష్‌ ఉప్పల్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement