గచ్చిబౌలి: సెల్ప్ డ్రైవ్ కోసం కార్లు అద్దెకు ఇస్తే రోజుకు రూ.2 వేల నుంచి రూ.5 వేలు ఇస్తానని నమ్మబలికిన ఓ కిలాడీ లేడీ ఘరానా మోసానికి పాల్పడింది. అద్దెకు ఇచ్చిన కార్ల ఆచూకీ తెలియకపోవడంతో బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. డీఐ సతీష్, బాధితులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. టెలికాంనగర్‌లో నివాసం ఉండే ఉష(48) సెల్ఫ్ డ్రైవ్ కోసం కార్లు అద్దెకు ఇస్తే రోజుకు రెండు వేల నుంచి ఐదు వేలు చెల్లిస్తానని నమ్మబలికారు. ఎక్కువ అద్దె వస్తుందని ఆశపడ్డ పలువురు కార్ల యజమానులు ఉషాకు అప్పగించారు. మూడు నెలలైెనా అద్దె డబ్బులు ఇవ్వకపోవడంతో ఆమెను నిలదీసినా ఫలితం కన్పించలేదు. దీంతో శంషాబాద్‌కు చెందిన గణేశ్ అనే వ్యక్తి రాయదుర్గం పోలీసులకు ఫిర్యాడు చేశాడు. విచారించగా ఉష తాను అద్దెకు తీసుకున్న కార్లను అత్తాపూర్‌లో నివాసం ఉండె సాగర్, అనిల్‌లకు అప్పగించి రూ.4 లక్షలు రుణం తీసుకున్నట్లు తేలింది. వీరు జియోట్యాగ్‌లు తొలగించి కార్లను కర్నాటకలోని బీదర్‌కు తరలించారు. దీంతో ఉషాతో పాటు డ్రైవర్ మల్లేష్‌పై కేసు నమోదు చేశారు. కార్లను కుదువపెట్టుకున్న సాగర్, అనిల్‌లు పరారీలో ఉన్నారు. ఉషను రాయదుర్గం పోలీసులు విచారిస్తున్నారు. వీరి చెరలో 20కి పైగా కార్లు ఉన్నట్లు డీఐ తెలిపారు.
రుణం తీసుకున్న
కిలాడీ లేడీ
పోలీసుల అదుపులో నిందితులు
Comments
Please login to add a commentAdd a comment