జగిత్యాల/ధర్మపురి/కొండగట్టు: కోటి కాంతుల దీపావళి పండుగను జిల్లా ప్రజలు గురు, శుక్రవారాల్లో ఘనంగా జరుపుకున్నారు. చిన్నాపెద్దా తేడా లేకుండా సంబరాలు చేసుకున్నారు. ఇంటి ఎదుట మహిళలు దీపాలు వెలిగించడంతో కాంతులు నిండాయి. వ్యాపార సముదాయాలు వద్ద రంగురంగు విద్యుద్ధీపాలతో అలంకరించారు. పెద్ద ఎత్తున బాణసంచాలు పేల్చి సంబరాలు చేసుకున్నారు. వ్యాపార యాజమానులు లక్ష్మీపూజలు నిర్వహించారు. పలు ఆలయాల్లో భక్తులు పూజలు చేశారు. కేదారేశ్వరస్వామి నోములు నిర్వహించారు. ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామి ప్రధాన ఆలయంలోని అద్దాల మండపంలో ధనలక్ష్మీ పూజలు ఘనంగా నిర్వహించారు. లక్ష్మీసూక్తం, పురుషసూక్తంతో వైభవంగా నిర్వహించారు. సాయంత్రం స్వామివార్లను పట్టణ పురవీధుల్లో ఊరేగించారు. సీనియర్ అసిస్టెంట్ అలువాలు శ్రీనివాస్, వేదపండితులు పాల్గొన్నారు. కొండగట్టు అంజన్న ఆలయంలో ఓం, శ్రీరామ అంటూ కనిపించే విధంగా దీపాలు వెలిగించారు.
Comments
Please login to add a commentAdd a comment